Tamannaah: ఫెమినా కవర్ పేజ్ పై మెరిసిన తమన్నా.. ఫొటోస్ వైరల్..!

Tamannaah.. మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది.. ఫెమినా కవర్ పేజ్ పై దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది.. తాజాగా ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గతంలో కూడా ఫెమినా స్టార్ ఇన్ ది స్పాట్ లైట్ అవార్డు..

Tamannaah: Tamannaah shined on Femina cover page.. Photos viral..!

Tamannaah: Tamannaah shined on Femina cover page.. Photos viral..!

అయితే గతంలో కూడా తమన్నా ఫెమినా స్టార్ ఇన్ ది స్పాట్ లైట్ అవార్డును దక్కించుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. వివిధ భాషా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడమే కాదు.. అంతకుమించి కోవిడ్ 19 సమయంలో తన మంచి మనసును చాటుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.. ప్రత్యేకించి కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని గుర్తించి.. ముంబైలో చిక్కుకుపోయిన 10, 000 మంది కార్మికులకు సహాయాన్ని అందించడానికి “ఎన్జీవో లెట్స్ ఆల్ హెల్ప్” తో భాగస్వామ్యం చేసుకొని అనేకమంది వ్యక్తులకు ఆహారంతో పాటు పరిశుభ్రత కిట్లను కూడా విరాళంగా అందించింది.. అంతేకాదు అవసరమైన ప్రతి ఒక్కరికి తాను సహాయాన్ని అందించి గొప్ప మనసు చాటుకుంది. సమాజం పట్ల ఆమెకున్న బాధ్యత ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. నిరుపేద పిల్లలకు మద్దతు ఇవ్వడం, జంతు సంక్షేమం , ఆడపిల్లలకు విద్యతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అందరిని మెప్పించింది.. అంతేకాదు కోయంబత్తూర్లో సద్గురు యొక్క గ్లోబల్ సేవ్ సాయిల్ కార్యక్రమానికి ఈమె హాజరైనప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన పోరాటం అక్కడ హైలెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆమె యొక్క మంచి మనసును గుర్తించిన ప్రభుత్వం ఈమెకు ” భేటీ బచావో బేటి పడావో “ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.. అంతే కాదు లింగ సమానత్వం, మహిళా సాధికారత అవసరాన్ని విస్తరించడానికి తన స్వరాన్ని కూడా ఉపయోగించింది. సమాజం పట్ల ఆమె అంకితభావం, మానవత్వం పట్ల ఆమెకున్న నిబద్ధతను ప్రదర్శిస్తుంది అనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఆమె తన వంతు సహాయాన్ని అందించింది.. ఈ నేపథ్యంలోనే ఈమెకు ఫెమినా ఇన్ ద స్పాట్ లైట్ అవార్డు లభించింది. ఇప్పుడు ఫెమినా కవర్ పేజ్ పై కూడా దర్శనమిచ్చి.. మరొకసారి తన ప్రతిభను నిరూపించుకుంది.

తమన్నా సినిమాలు..

తమన్నా కెరియర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ హోదాని అనుభవిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.. మరొకవైపు తాను ప్రేమించిన విజయ్ వర్మను త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఇంకా ఈ విషయంపై క్లారిటీ లేదు.. మొత్తానికైతే అటు సినిమాల ద్వారా వెండితెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నిజజీవితంలో రియల్ హీరోగా ఎంతోమందికి సహాయ సహకారాలను అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు