Swag: శ్రీ విష్ణు అన్ని బ్యాచెస్ ను కవర్ చేసాడు

Swag: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు(Sree Vishnu) ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శ్రీ విష్ణు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత మంచి గుర్తింపు సాధించుకొని మెల్లమెల్లగా హీరో గానే సినిమాలు చేయటం మొదలు పెట్టాడు శ్రీ విష్ణు. వేణు ఉడుగుల దర్శకుడిగా పరిచయమైన నీది నాది ఒకే కథ సినిమా విష్ణు కి మంచి బ్రేక్ ఇచ్చింది. అలానే వేణుని కూడా దర్శకుడుగా స్థిరపరిచింది.

ఇంక తన కెరియర్ లో ప్రస్తుతం చాలా విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు శ్రీ విష్ణు. ఒక టైం లో శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ వరుస డిజాస్టర్స్ చూశాడు. కానీ రీసెంట్ టైమ్స్ లో సామజవరగమన సినిమాతో మంచి హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాను మినీ నువ్వు నాకు నచ్చావ్ అంటూ కూడా కొంతమంది ప్రశంసించారు.

ప్రస్తుతం శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇదివరకే చాలా కంటెంట్ రిలీజ్ అయింది. కానీ ఈ కంటెంట్ సంబంధించి సినిమా కథ ఏంటో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఈ సినిమా కంటెంట్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. ఇదివరకే వీరి కాంబినేషన్లో రాజరాజ చోరా అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

SWAG

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ కానుంది. దీని గురించి స్వయంగా శ్రీ విష్ణు అప్డేట్ ఇచ్చారు. అయితే శ్రీ విష్ణు అప్డేట్ ఇస్తూ టి ఎఫ్ ఐ బానిస, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫీల్డ్ హియర్ బ్యాచ్, సినీ ఫీల్స్ వంటి వర్డ్స్ వాడారు. ఈ వర్డ్స్ అన్ని సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి శ్రీ విష్ణు సోషల్ మీడియాని ఎంతలా ఫాలో అవుతున్నారు అని అర్థమవుతుంది. శ్రీ విష్ణు అనౌన్స్మెంట్ ఇచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు