SSMB29 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్ట్స్ లో SSMB29 ఒకటి. ఈ సినిమా పూర్తయ్యేసరికి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు పైన పడుతుంది. చాలామంది స్టార్ హీరోలను చేసిన ఎస్.ఎస్ రాజమౌళి తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోతో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు అంటే ఎన్టీఆర్(Ntr), ప్రభాస్(Prabhas), రామ్ చరణ్(Ram Charan) వంటి హీరోల పేర్లను చెబుతూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ స్టార్ డం తీసుకొచ్చింది ఎస్.ఎస్ రాజమౌళి(Rajamouli). కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రాజమౌళితో పనిచేయడానికంటే ముందే మంచి స్టార్డమ్ ఉంది.
ఇక ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు ఎక్కడ దర్శనమిచ్చినా కూడా లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ ఉంటాడు. మామూలుగా రాజమౌళి హీరోలు రాజమౌళితో సినిమా చేసే టైంలో పెద్దగా కనిపించరు. కానీ మహేష్ బాబు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎయిర్పోర్ట్లోనూ విదేశాలలోను కనిపిస్తూ ఉంటారు. అయితే అది ఫ్యాన్స్ కి ఆనందం ఇచ్చిన కూడా దర్శకుడు రాజమౌళికి కొద్దిపాటి అసంతృప్తిని ఇస్తుంది.
ఇకపోతే ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి చాలామంది ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సరైన అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. కానీ అందరికీ ఒక క్లారిటీ ఉంది 2028 వరకు మహేష్ బాబు సినిమా అయితే రాదు అని అందరికీ తెలుసు. ఇకపోతే మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సింహకోడూరి. ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సింహ.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సింహను ఎస్ ఎస్ ఎం బి 29 ప్రాజెక్ట్ గురించి అడిగారు. దానికి సింహ సమాధానం ఇస్తూ నాకు కూడా ఆ సినిమా గురించి అసలు ఏమీ తెలియదండి అంటూ చెప్పుకొచ్చారు. మామూలుగా బయట వాళ్లకి తెలియకపోవడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చివరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమా గురించి ఏమీ తెలియదు హ్యాండ్సప్ అని చేతులెత్తేస్తున్నారు. సినిమా గురించి సరైన అప్డేట్లు రాకపోయినా కూడా కచ్చితంగా ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని అందరికీ ఒక నమ్మకం ఉంది.