Srireddy: పొలిటికల్ లీడర్ తో పెళ్లి.. ఎమోషనల్ వీడియో చేసిన శ్రీ రెడ్డి..!

Srireddy.. ప్రముఖ నటి శ్రీరెడ్డి.. తెలుగులో నటించింది ఒకటో రెండో సినిమాలే అయినా సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈమె నిత్యం ఏదో ఒక వార్తపై స్పందిస్తూ వైరల్ గా మారుతుంది.. ముఖ్యంగా ఈమె పెట్టే పోస్టు సంచలనం సృష్టిస్తూ పలు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో శ్రీరెడ్డి.. పొలిటికల్ లీడర్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి లాంటి మొగుడు కావాలని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే .ఇక అప్పటినుంచి ఈమె సిద్దార్థ్ తో సహజీవనం చేస్తోంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.. అంతేకాదు ఈమధ్య వీరిద్దరికిపెళ్లి కూడా ఫిక్స్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది..

బైరెడ్డి తో పెళ్లి పై శ్రీ రెడ్డి క్లారిటీ..

Srireddy: Marriage with a political leader.. Sri Reddy made an emotional video..!
Srireddy: Marriage with a political leader.. Sri Reddy made an emotional video..!

శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. అంత ఖాళీగా ఉన్నారేంట్రా..? పని పాట ఏం లేదా.. ? ఆ మీమ్స్ ఏంటి? మొన్నటిదాకా బీచ్ లో బట్టలూడతీసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేసారు . ఎక్కడా నేను నా అఫీషియల్ పేజ్ లో అలాంటి పోస్టులు పెట్టలేదు.. ఏదైతే వీడియోలు చేశానో.. అంతకుముందు ఏవైతే పోస్టులు పెట్టానో .. ఏవైతే నేను లైవ్ లో చేశానో .. అవి అలాగే ఉన్నాయి.. ప్రతి ఒక్కటి కూడా అందులో ఏది డిలీట్ చేయలేదు.. ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పడేస్తే.. మళ్లీ ఇంకొకటి మొదలుపెట్టారు.. ప్రతి వాళ్ళకి కూడా నేనే ఒక హాట్ కేకుల దొరికిపోతున్నాను.. నేనేం అందగత్తెను కాదు కదా.. నేను పెద్ద ఇదేం కాదు.. కానీ అంతా నా మీద పడి ఏడుస్తున్నారు.. ఎందుకో.. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి నా గురించి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు…

అతడికి నాకు ఎటువంటి సంబంధం లేదు..

అసలు ఆ అబ్బాయి ..నేను రిలేషన్ లో ఉన్నామని అంటున్నారు.. నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడు.. అలాంటివాడు మొగుడుగా వస్తే బాగుంటుంది అన్నాను.. కానీ నిజంగా నేనెప్పుడూ బైరెడ్డిని చూడలేదు.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు.. అసలు ఆయన ఎక్కడుంటాడనేది కూడా నాకు తెలియదు.. నా జీవితం గురించి నాకు ఎటువంటి బాధ, భయం లేదు ఇలాంటివి వస్తే భవిష్యత్తులో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు.. నా జీవితం నాశనం అయ్యింది చాలు.. ఇంకా అవ్వాల్సిందేమీ లేదు కాబట్టి ఇటువంటి ప్రచారాలు చేస్తే నాకు నష్టం కలిగేదేమీ లేదు.. కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని మీరు నాశనం చేయకండి.. అతను ఇంకా చిన్నపిల్లోడు.. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.. నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి.. కానీ కొంతమంది ఏమో పెళ్లి వల్లే వీడియోలు చేయట్లేదని పుకార్లు సృష్టిస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు కాకూడదని ఈ వీడియో చేస్తున్నాను.. అటు ఆడవారికైనా ఇటు మగవారికైనా జీవితం అనేది చాలా ముఖ్యం.. బైరెడ్డి జీవితం బాగుండాలి.. ఇప్పుడు బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడానికి , రిలేషన్ షిప్ లో ఉండడం లాంటివి లేవు.. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపండి అంటూ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసింది శ్రీరెడ్డి..

- Advertisement -

రూమర్స్ సృష్టించడం కంటే ఇతరులకు సాయం చేయండి..

అంతేకాదు తప్పుడు ప్రచారాలు చేయకుండా భగవంతుడిని ప్రార్థించండి . ఏదైనా అనాధ శరణాలయాలకు వెళ్లి, వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేయండి .. ఉన్న మాటలు అంటే అనండి అంతేకానీ లేనివి ప్రచారం చేయకండి.. రాజకీయంగా అయినా ఏదైనా తప్పుగా మాట్లాడితే తిట్టండి అంతవరకు చాలు కానీ ఇటువంటి అబద్ధాలు సృష్టించి అందరి జీవితాలను నాశనం చేయకండి అంటూ తెలిపింది శ్రీరెడ్డి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు