Srikanth Odela: దసరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షను సాధించాడు. దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్రియేట్ చేసాడు శ్రీకాంత్. సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు శ్రీకాంత్. ఎస్ ఎల్ ఎన్ క్రియేషన్స్ లో దసరా సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించిన ఆ సంస్థకి దసరా సినిమా కమర్షియల్ సక్సెస్ అందించింది.
లేకపోతే సినిమా మీద ఇష్టంతో కొంతమంది దర్శకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు. ఇంకొంతమంది సినిమా అంటే విపరీతమైన పిచ్చితో ఎంట్రీ ఇస్తారు. అమెరికాలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న చాలామంది ఇండియాకి రిటర్న్ వచ్చి సినిమా దర్శకులుగా మారారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం సినిమాని ఎంతలా నమ్ముతారు అని అంటే సినిమా కోసం ఏదైనా చేసేస్తారు. శ్రీకాంత్ ఓదెల విషయానికి వస్తే పై చదువులు చదవడం ఇష్టం లేక కావాలనే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఫిలిం కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్ తప్పనిసరిగా ఉండాలి అని తెలిసిన తర్వాత ఇంటర్ పాస్ అయ్యాడు. ఫిలిమ్స్ కోర్సులో ఫెయిల్ అయిన శ్రీకాంత్ ను ఇంట్లో పేరెంట్స్ డిగ్రీ జాయిన్ అవ్వమని ఒత్తిడి తీసుకొచ్చారు.
శ్రీకాంత్ కి సినిమాలపై ఉన్న ఆసక్తితో తన ఏడవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా కాల్చేసాడు. ఇకపోతే శ్రీకాంత్ నిన్న హాజరైన సరిపోదా శనివారం ఈవెంట్ లో మాట్లాడుతూ కొంతమంది దర్శకులు మాత్రమే ప్రేక్షకుడితో డైరెక్ట్ గా మాట్లాడుతారు. నాతో అలా మాట్లాడింది వివేక్ ఆత్రేయ. తను చేసిన బ్రోచేవారెవరురా సినిమాలో ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్స్ ని చింపేస్తుంది. ఆ సీన్ కు నేను బాగా కనెక్ట్ అయినా అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చాలామంది సర్టిఫికెట్స్ ని కనీసం పట్టించుకోకుండా ఉన్న వ్యక్తులు సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా సాధించాలి అని ఉండే ఏకైక ఆప్షన్ సినిమా మాత్రమే అని చెప్పొచ్చు. ఇలా శ్రీకాంత్ లాంటి దర్శకులు ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంతమంది వస్తారో ముందు ముందు చూడాలి.