Sridevi Birth Anniversary.. అతిలోకసుందరి అందాల తార దివంగత స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో , నటనతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసిన ఈమె ఒక్క గ్లామర్ తోనే సినీ ప్రేక్షకులనే కాదు యావత్ అన్ని రంగాల వారిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమెతో ఒక్కరోజు లేదా ఒక్క గంట అయినా టైం స్పెండ్ చేస్తే చాలు అని కోరుకునే వారు కోకొల్లలు. ముఖ్యంగా దుబాయ్ కి చెందిన అత్యంత ధనవంతులు కూడా ఈమె కోసం వచ్చేవారు అంటే ఈమె క్రేజ్ ఎలా పాకిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ అందం వెనుక కొంత రహస్యం దాగి ఉందట.
బరువు తగ్గడానికి డైట్ పిల్స్..
ఏదైనా ఒకటి పొందాలి అంటే మరొకటి కోల్పోవాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే అందంగా కనిపించడం కోసం శ్రీదేవి ఎన్నో కోల్పోయిందట. చివరికి కడుపునిండా తిండి కూడా తినలేని పరిస్థితి. అంతలా అన్ని సర్జరీలు, అంత కష్టం పడింది కాబట్టి శ్రీదేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గానే నిలిచిపోయింది. మరి అందంగా ఉండడం కోసం ఆమె పడిన కష్టం ఎలాంటిదో ఈరోజు చూద్దాం.
అందంగా కనిపించడానికి 29 ప్లాస్టిక్ సర్జరీలు..
యావత్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఘడించిన శ్రీదేవి దాదాపు 29 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందట. అందంగా కనిపించడం కోసం తరచూ సర్జరీలు చేయించుకునే వారని సమాచారం. అంతేకాదు మరణానికి కొంతకాలం ముందు కూడా ఆమె శస్త్రచికిత్స చేయించుకుందట. మరణానికి ముందు శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె అందాన్ని చూసి ముగ్దురాలు అయ్యాను అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు. దీనికి తోడు నాలుగు పదుల వయసు లో కూడా ఈమె అందంగా కనిపించడమే కాదు తక్కువ బరువు, పైగా ముఖంలో ఒక్క ముడత కూడా కనిపించలేదట. అయితే ఇదంతా కాస్మెటిక్ సర్జరీ వల్లే జరిగిందని సమాచారం. అందం విషయంలో ఈమె చాలా కాన్షియస్ గా ఉండేదట. తన అందం చెక్కుచెదరకుండా ఉండడానికి ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా తీసుకుందట. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు సహజంగా దేవుడిచ్చిన అందం కాదా డబ్బు పోసి అందాన్ని కొనుక్కుందా అంటూ విమర్శించే రకంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
శస్త్ర చికిత్స విఫలం అవడంతో అలాంటి పని..
ఇదిలా ఉండగా మరోవైపు శ్రీదేవి శస్త్ర చికిత్స కోసం యూఎస్ లోని సౌత్ కరోలినాకు తరచుగా వెళ్తూ ఉండేవారు ఆమె చేయించుకున్న సర్జరీలలో ఒకటి సక్సెస్ కాలేదట. దాని కారణంగానే ఆమె పెదవులు ఆకృతి దెబ్బతిన్నాయి. ఇక శస్త్ర చికిత్స విఫలం కావడంతో సౌత్ కరోలినా లోని ఒక డాక్టర్ ఆమెకు డైట్ పిల్స్ తీసుకోవాలని సలహా ఇచ్చారట. అంతే కాదు మందులు కూడా వాడేదట. ముఖ్యంగా ఆహారం తినకుండా, పిల్స్ తీసుకుంటూ అందం కోసం ఎంతో కష్టపడిందట శ్రీదేవి. ప్రస్తుతం ఈ విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈమె కూతుర్లు ఇద్దరూ కూడా ఇప్పుడు సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.