Bagheera : కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫుల్ జోరుమీదున్నాడు. లాస్ట్ ఇయర్ “సలార్” తో బ్లాక్ బస్టర్ కొట్టగా, ఇప్పుడు ఎన్టీఆర్ తో తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ తో సలార్ రెండో పార్ట్ కూడా తీయనున్నారు. అయితే ఈ మధ్యలో ప్రశాంత్ నీల్ కథ అందించిన ఒక కన్నడ భారీ బడ్జెట్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. కన్నడ స్టార్ శ్రీమురళి (Sri Murali) హీరోగా నటించిన కొత్త సినిమా “బఘీరా”. కెజిఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ “హోంబలే ఫిలిమ్స్” (Hombale Films) ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా భగీర మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు.
భగీర రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..
ఇక “భగీర” (Bagheera) సినిమాను కన్నడ డైరెక్టర్ సూరి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా కథను స్వయంగా ప్రశాంత్ నీల్ అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ (Rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా భగీర మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను ఈ ఏడాది అనగా, 2024 అక్టోబర్ 31న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. దీపావళి కానుకగా “భగీర”ను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించగా, ఆ పోస్టర్ లో భగీర మాస్క్ ని చూపించారు. ఇక ‘ఉగ్రమ్’ మూవీ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్ గా శ్రీమురళి..
ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) అందించిన సినిమాల్లో అన్ని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లే ఉండగా, ప్రతి సినిమాలో హీరో ఒక గ్యాంగ్ స్టర్ లా, లేదా డాన్ లా ఉన్నట్టు చూపించగా, ఈ సినిమాలో ఫస్ట్ టైం ఒక పోలీస్ క్యారెక్టర్ తో కూడిన కథను రాశారు. శ్రీ మురళి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా భగీర లో నటిస్తున్నాడు. అయితే ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల వల్ల, న్యాయం కోసం యూనిఫామ్ వదిలేసి యుద్ధం చేస్తాడని సమాచారం. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనుండగా, ప్రశాంత్ నీల్ గత సినిమాల్లో లాగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది.