Sreeleela.. ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు తెలుపుతూ.. ఒకే ఏడాది తొమ్మిదికి పైగా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒకే ఏడాది అన్ని చిత్రాలకు సంతకం చేసిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది శ్రీ లీల.
అయితే ఏమైందో తెలియదు కానీ కథల ఎంపిక విషయంలో తడబాటు పడ్డ ఈమె సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోయే చిత్రానికి కూడా మొదట ఈమెను తీసుకున్నారు. కానీ ఈమె నటించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో సినిమా నుంచి ఈమెను తప్పించడం జరిగింది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య కూతురుగా నటించింది. కానీ ఈ సినిమా సక్సెస్ అయిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అలాగే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీ లీల నటించింది. కానీ ఈ సినిమా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది శ్రీ లీల.
ఆ అర్హత నాకు లేదు..
ఇది ఇలా ఉండగా తాజాగా ఈమె తన అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ కూడా స్టార్ అని పిలిపించుకోవడానికి తనకి ఇంకా అర్హత రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై శ్రీ లీల మాట్లాడుతూ.. నా దృష్టిలో స్టార్ కిరీటం అన్నది ఒకటి రెండు చిత్రాల ప్రయాణంతో వచ్చే అంత సులభమైనది కాదు.. ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలి. సంవత్సరాలపాటు ప్రేక్షకులతో కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడే స్టార్ అని పిలిపించుకోవడానికి తగిన అర్హత పొందుతానని చెప్పుకొచ్చింది శ్రీ లీల.. దీంతో ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రిక్వెస్ట్ చేస్తున్న శ్రీ లీల..
తనను ఎవరైనా సరే స్టార్ అని పిలిస్తే సున్నితంగా అలా పిలవద్దని చెబుతానని అంటోంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం విభిన్నమైన కథలు, పాత్రలు చేయడం పైనే ఉందని చెప్పుకొచ్చిన శ్రీ లీల స్పెషల్ సాంగ్స్ లో నటిస్తారా అన్న ప్రశ్నకి కూడా బదులిచ్చింది. అయితే ప్రస్తుతం తనకు స్పెషల్ సాంగ్స్ లో నటించాలనే ఆలోచన లేదు అంటూ తెలిపింది. మొత్తానికైతే శ్రీ లీల చేసిన కామెంట్ లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే స్టార్ అనే పదానికి నిర్వచనం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.