Sreeja : అవన్నీ పచ్చి పుకార్లు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన భరద్వాజ్ తల్లి..!

Sreeja : మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా వ్యక్తిగత కారణాల వల్ల భారీ పాపులారిటీ సంపాదించుకుంది. మొదట తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ కోసం ఏకంగా మెగా కుటుంబం పరువు తీసి ఈమె అతడితో వెళ్లిపోయింది. ఒక కూతురుకి జన్మనిచ్చిన తర్వాత కట్నం కోసం అతడు పెట్టే టార్చర్ భరించలేక తిరిగి తండ్రి వద్దకు చేరుకుంది. ఆ తర్వాత తండ్రి చూపించిన అబ్బాయి( కళ్యాణ్ దేవ్ )ని రెండో వివాహం చేసుకున్న ఈమె మరో బిడ్డకు జన్మనిచ్చింది.. ఇక ఇప్పుడు కూడా అతడితో ఉండలేక.. తల్లిదండ్రులతోనే జీవితం కొనసాగిస్తుందని సమాచారం.. ఇలా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వైవాహిక విషయాలపై వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ..

Sreeja: All these are raw rumours.. Bharadwaj's mother who made emotional comments..!
Sreeja: All these are raw rumours.. Bharadwaj’s mother who made emotional comments..!

భరద్వాజ్ విషయంలో వచ్చినవన్నీ పుకార్లే..

అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్.. ఇటీవలే అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మరణించారు.. ఆయన మృతి పై రకరకాల రూమర్స్ వైరల్ అవుతుండడంతో ఆయన తల్లి మీడియా ముందుకు వచ్చి పలు విషయాలను వెల్లడించారు… శ్రీజ అత్తగారు మాట్లాడుతూ.. భరద్వాజ్ లంగ్స్ డామేజ్ వల్ల చనిపోయారని రూమర్లు వచ్చాయి.. అందులో నిజం లేదు.. ఆకస్మాక కార్డియాక్ అరెస్టు వల్లే చనిపోయాడు అంటూ ఆమె స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మేము హైదరాబాదులోనే ఉంటున్నాము.. చికిత్స కోసం శిరీస్ భరద్వాజ్ ను జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్స్ లో చేర్పించాము.. మే 13వ తేదీన భరద్వాజ్ పుట్టిన రోజు కాగా.. తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ వెళ్ళాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో మే 17న అపోలో ఆసుపత్రిలో చేర్పించాము సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న భరద్వాజ్ ఉన్నట్టుండి గుండెపోటుతో జూన్ 19న మరణించాడు. అయితే దీన్ని కొన్ని మీడియా సంస్థలు చాలా తప్పుగా రాసారు.. ఇందులో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది భరద్వాజ్ తల్లి.

శ్రీజ చాలా మంచి అమ్మాయి..

2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా జరిగిన వివాహం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై కూడా శ్రీజ గురించి భరద్వాజ్ తల్లి మాట్లాడుతూ.. శ్రీజ చాలా మంచి అమ్మాయి.. అందరూ అనుకున్నట్టుగా ఆమెను తప్పుపట్టాల్సిన పనిలేదు.. వారి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతోంది.. వారు ఎందుకు విడిపోయారో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు.. కానీ శ్రీజ, భరద్వాజ్ లకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రి లాగే తండ్రి పోలికలతో పుట్టింది. ఆ పాపను చూస్తే చాలు నాకు భరద్వాజ్ ని చూసినట్లే అనిపిస్తుంది.. నా కొడుకు లేకపోయినా నా కొడుకుని నివృత్తి రూపంలో చూడాలనుకుంటున్నాను.. నా మనవరాలిని పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది.. మరి మెగా కుటుంబం నాకు అవకాశం కల్పిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.. నా భర్త లాయర్ గా పనిచేసేవారు.. 2016లో మరణించారు.. ఇప్పుడు కొడుకు కూడా పోయాడు.. ప్రస్తుతం చిన్న కొడుకుతో ఉంటున్నాను అంటూ భరద్వాజ్ తల్లి చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు