South Industry: ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతోనే కాదు సన్నని నడుముతో ఎంతోమంది కుర్ర కారు గుండెల్లో రైలు పరిగెత్తేలా చేసింది. యువత హార్ట్ బీట్ పెంచేసి తన అందాల సోయగాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి తెలుగు స్టార్ లందరితో కూడా కలిసి నటించి ఆకట్టుకుంది.
సడెన్ గా టాలీవుడ్ కి దూరమైన ఇలియానా..
ముఖ్యంగా డిమాండ్ కు తగ్గట్టుగా సినిమాలలో పారితోషకం అందుకుంటూ, తనదైన శైలిలో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా ఇండస్ట్రీ నుంచి దూరమైంది. అయితే ఉన్నట్టుండి ఇలియానా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడంతో అభిమానులందరూ ఆశ్చర్యపోయారు.తన అందచందాలతో, నడుము అందాలతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అలా ఉన్నట్టుండి టాలీవుడ్ కి దూరమయ్యి, బాలీవుడ్ కి మకాం మార్చడంతో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయాలపై గతంలో ఒక నిర్మాత చెప్పిన కామెంట్లు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి.
రూ.40 లక్షలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వని ఇలియానా..
ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత మాట్లాడుతూ.. ఇలియానా ఒక తమిళ చిత్రానికి డేట్ ఇచ్చి రూ.40 లక్షలు తీసుకుంది. సాధారణంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల సంఘాలు చాలా బలంగా ఉంటాయి. తెలుగు చిత్ర సీమలో టాప్ సెలబ్రిటీలపై నిషేధం కూడా విధిస్తూ ఉంటారు. అలాగే ఇలియానా చేసిన ఒక పని వల్ల ఆమెను తెలుగులోనే కాదు తమిళ్లో కూడా బ్యాన్ చేయడం జరిగింది అంటూ తెలిపారు నిర్మాత. మరి నిర్మాత మాట్లాడుతూ.. నటి ఇలియానా ఒక తమిళ సినీ నిర్మాత నుంచి రూ.40 లక్షల అడ్వాన్సుగా తీసుకుంది. కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా బెట్టు చేసింది. ఆ నిర్మాత మాకు ఫిర్యాదు కూడా చేశారు. ఫోన్ చేసి విచారిస్తే ఇలియానా.. నేను డేట్స్ ఇచ్చాను. కానీ నా డేట్స్ వాళ్ళు ఉపయోగించుకోలేదు అంటూ తెలిపారు. కానీ నిర్మాతల సంఘం ఆమె ఇచ్చిన డేట్స్ బయటకి తీస్తే.. అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ లో ఇలియానా వేరే సినిమాలలో నటించినట్లు తెలిసింది. వెంటనే ఆమెపై నిషేధం విధించాము.
అందుకే బ్యాన్ విదించాము..
నిజానికి మా రూల్ ప్రకారం అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సెట్ కి వచ్చి కచ్చితంగా నటించాలి. అప్పుడే నటిస్తున్నట్టు.. అయితే అడ్వాన్స్ తీసుకొని షూటింగ్ మొదలు కాలేదు..ఆర్టిస్టులు సెట్ కి రాలేదు . కాబట్టి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలి. ఇదే మా రూల్ అందుకే ఇలియానా సెట్ కి రాలేదు కాబట్టే రూ .40 లక్షలు రిటర్న్ ఇవ్వమని చెబుతున్నారు. అయితే ఒక తమిళ సినిమాలో ఈమె నటిస్తోందని తెలిసిన తర్వాత ఆ సినిమా నిర్మాతలకు చెప్పి ఆమెను తీయించాము అంటూ తెలిపారు నిర్మాత. ఆ తర్వాత కాలంలో ఈమెపై నిషేధం ఎత్తివేయడంతో రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది.