ChennakesavaReddy : నటసింహం నందమూరి బాలకృష్ణ – వివి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చెన్నకేశవ రెడ్డి. ఫాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2002 లో థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. భారీ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా వివి వినాయక్ (VV Vinayak) చెన్నకేశవరెడ్డిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. బాలయ్య (Balakrishna) అభిమానులకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో ఇదొకటి. ఇక ఈ సినిమాలో శ్రీయ శరన్ (Sriya Saran), టబు హీరోయిన్లుగా నటించడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కూడా కావడం జరిగింది. ఇదిలా ఉండగా చెన్నకేశవరెడ్డి (ChennakesavaReddy) సినిమా గురించి డైరెక్టర్ వివి వినాయక్ పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో నిజానికి హీరోయిన్ గా సౌత్ లో టాప్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట.
టబు పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇక చెన్నకేశవరెడ్డి లో ఇద్దరు హీరోయిన్లు నటించగా, బాలకృష్ణ యంగ్ పాత్రకి శ్రీయ శరన్, బాలయ్య ఓల్డ్ పాత్ర అయిన చెన్నకేశవరెడ్డి పాత్రకి హీరోయిన్ గా టబు (Tabu) నటించింది. అయితే నిజానికి వివి వినాయక్ టబు పాత్రని వేరే స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట. ఆవిడ ఎవరో కాదు అప్పట్లో సౌత్ లోనే టాప్ పొజిషన్ లో ఉన్న “సౌందర్య” (Soundarya). ఇక హీరోయిన్ పాత్ర కోసం అప్పట్లో వివి వినాయక్ సౌందర్య కోసం బెంగుళూరు వెళ్లి ఆమెకి కథ వినిపించగా, సున్నితంగా రిజెక్ట్ చేశారట. దీనికి ఆ పాత్ర ఓల్డ్ వయసున్న పాత్ర కావడమే కారణమట. ఈ విషయాన్నీ స్వయంగా వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అప్పటికీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఓల్డ్ ఏజ్ ఉన్న పాత్రలు చేయనని వినాయక్ కి చెప్పారట. ఆ తర్వాత టబు ని హీరోయిన్ గా తీసుకున్నారట వినాయక్.
ఆశించిన విజయం అనుకోని చెన్నకేశవరెడ్డి..
అయితే చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ తెచుకున్నా, మేకర్స్ లో ఎదో వెలితి. సినిమా అంతా బాగానే ఉన్నా, మళ్ళీ మళ్ళీ సినిమా గురించి మాట్లాడుకునేలా లేదని టాక్ వచ్చింది. ఆ చిన్న నెగిటివిటి బాగా స్ప్రెడ్ అయి, బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాల్సిన ఈ సినిమా ఓ మోస్తరు హిట్ అయిందన వివి వినాయక్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ చేసిన ఓ నెగటివ్ వ్యాఖ్యలు కూడా ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడానికి కారణమయ్యాయని అన్నాడు.