Sonali Bendre : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటి ఇస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీని రీరిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దానిపై తాజాగా సోనాలి బ్రిందే (Sonali Bendre) సంచలన వ్యాఖ్యలు చేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి మీడియాలో ట్రెండ్ అవుతుంది..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’( Indra ) కూడా ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్న రోజులవి. అలాంటి ట్రెండ్ లో వచ్చిన ఇంద్ర ఒక సునామీ సృష్టించింది అనే చెప్పాలి. అప్పటిలో మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు చిరు బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ అవ్వబోతుందని తెలిసిందే. ఈ మూవీ ప్రీ బుకింగ్స్ కూడా భారీగా జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా రీరిలీజ్ పై చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ పై ఇంద్ర మూవీ హీరోయిన్ సోనాలి బ్రిందే కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈమె ఇంద్ర సినిమా సమయంలో జరిగిన విషయాలను పంచుకుంది. తాజాగా సోనాలి ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ఆ వీడియో ఆమె మాట్లాడుతూ.. వైజయంతి బ్యానర్ లో వర్క్ చెయ్యడం గొప్ప అనుభూతి. చిరంజీవితో నటించడం ఎప్పటికి మర్చిపోలేను. ఆయనతో డ్యాన్స్ చెయ్యడం కష్టం. నాకు డ్యాన్స్ అంటే చుక్కలు కనిపించేవి. దాయి దాయి దామ్మా పాట షూటింగ్ అన్నప్పుడు నాకు అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రంతా చిరుతో కలిసి స్టెప్పులు ప్రాక్టీస్ చేసానని చెప్పింది. ఆ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది.. అలాంటి సూపర్ హిట్ మూవీని మరోసారి స్క్రీన్ మీద చూడటం కోసం ఎదురు చూస్తున్నాం. చిరంజీవి ఫ్యాన్స్ కు పండగే అనే ఆమె అన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక రేపు చిరు బర్త్ డే సందర్బంగా విశ్వంభర నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుంది.
Relive the magic of #INDRA with @iamsonalibendre as she takes us down memory lane and shares her excitement for the August 22nd re-release. 🎬https://t.co/EV1czND08h#Indra4K
Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal #AarthiAgarwal @tejasajja123 #ManiSharma @GkParuchuri… pic.twitter.com/ivZ4Rs4IdO— Prathyangira Cinemas (@PrathyangiraUS) August 21, 2024