Sonakshi Sinha : పెళ్లై నెలకూడ కాకుండానే ప్రెగ్నెంట్… ఒక్క కామెంట్ తో అసలు విషయం చెప్పిన సోనాక్షి

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ గత కొంతకాలంగా పెళ్లి కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ జంట మతాంతర వివాహం కారణంగా ఓ రేంజ్ లో ట్రోల్ అయ్యింది. ఆ ట్రోల్స్ ను పక్కన పెడితే పెళ్ళయిన కొన్ని రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అయితే తాజాగా సోనాక్షి ఆ వార్తలపై స్పందిస్తూ అసలు విషయం ఏంటో వెల్లడించింది.

ప్రెగ్నెంట్ వార్తలపై సోనాక్షి రియాక్షన్

హీరోయిన్ సోనాక్షి, నటుడు, ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను జూన్ 23న బాంద్రాలోని సివిల్ కోర్టులో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ఈ కొత్త దంపతులు ఏర్పాటు చేసిన గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తరువాత గంటల వ్యవధిలోనే సోనాక్షి, జహీర్ ముంబైలోని ఒక ఆసుపత్రికి వెళ్ళడం కొత్త అనుమానాలకు తెర తీసింది. ఆమె ఆసుపత్రిలో అడుగు పెట్టిన క్షణాల్లోనే సోనాక్షి ప్రెగ్నెంట్ అనే పుకార్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సోనాక్షి ఇప్పుడు ఈ పుకార్లపై తన మౌనాన్ని వీడింది. తన ఆన్సర్ టో నెటిజన్లకు గట్టి గుణపాఠం చెప్పింది.

Sonakshi Sinha honeymoon pics | Newlyweds Sonakshi Sinha, Zaheer Iqbal's beach honeymoon is all about romance and sunsets | PICS | Celebrity News - News9live

- Advertisement -

సోనాక్షి హీరోయిన్ గా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘కాకుడ’ విడుదలకు సిద్ధంగా ఉంది. తన సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత తన జీవితం గురించి మాట్లాడింది. పైగా తమపై జరిగిన ట్రోలింగ్, ప్రెగ్నెంట్ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. సోనాక్షి మాట్లాడుతూ ‘ఈ సంబంధంలో ఉన్న అందం ఏమిటంటే, నేను మునుపటిలాగే ఫీల్ అవుతున్నాను. నేను తిరిగి వర్క్ స్టార్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది” అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ప్రెగ్నెంట్ రూమర్లపై స్పందిస్తూ ‘మేము ఇకపై ఆసుపత్రికి వెళ్ళాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆసుపత్రికి వెళ్తే చాలు ప్రెగ్నెంట్ అంటున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి తనపై రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ నోళ్ళు మూయించింది. నిజానికి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన తన తండ్రిని చూడడానికి సోనాక్షి ఆరోజు హాస్పిటల్ కు వెళ్ళింది. అయితే మరోవైపు సోనాక్షి సిన్హా పెళ్లి జహీర్ తో చేయడం ఆమె తండ్రితో పాటు కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ ఇష్టం లేదని అంటున్నారు. అంతేకాకుండా ఆమె సోదరుడు కూడా పెళ్ళికి హాజరుకాకపోవడం గమనార్హం.

సోనాక్షి సినిమాలు..

సోనాక్షి చివరిసారిగా అంటే పెళ్ళికి ముందు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్‌లో కన్పించింది. రానున్న రోజుల్లో ఆమె ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్-కామెడీ చిత్రం ‘కాకుడ’లో కనిపించనుంది. ఈ చిత్రంలో రితీష్ దేశ్‌ముఖ్, సాకిబ్ సలీమ్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ Zee5లో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. అయితే పెళ్లయ్యాక సోనాక్షి తన నెక్స్ట్ మూవీకి ఇంకా సైన్ చేయలేదు. మరి నెక్స్ట్ ఆమె కెరీర్ ఎలా ఉండబోతోందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు