Sobhita.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇటీవలే అక్కినేని హీరో నాగచైతన్యతో హైదరాబాదులో ఆగస్టు 8వ తేదీన కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా తెగ గూగుల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలు ఈమెకు బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈమెకు బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
IMDb జాబితాలో రెండవ స్థానం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అత్యధిక ప్రజాదారణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో శోభిత రెండవ స్థానంలో నిలిచింది. ఇండియన్ మూవీస్ డేటా బేస్ ఆధారంగా ఈవారం అత్యంత ప్రజాదారణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేయగా ఈ జాబితాలో నటి శార్వరీ మొదటి స్థానంలో నిలవగా, శోభిత రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలవగా, నాల్గవ స్థానంలో కాజల్ ,ఐదవ స్థానంలో జాన్వీ కపూర్ ఉన్నారు. ఇక ఆ తర్వాత స్థానాలలో లక్ష్య , దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, మృనాల్ ఠాకూర్, ఐశ్వర్యరాయ్ తదితరులు ఈ వారం టాప్ 10 లో నిలిచారు. ఏదేమైనా ఈ వారం టాప్ సెలబ్రిటీలు అందరిని వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది శోభిత ధూళిపాళ. ఇండియన్ సెలబ్రిటీల జాబితా పక్కన పెడితే.. టాలీవుడ్ జాబితా ప్రకారం నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు.
నాగచైతన్యతో నిశ్చితార్థం ..శోభిత కు కలిసొచ్చిందే..
ఇకపోతే గతంలో 68వ స్థానాన్ని దక్కించుకున్న శోభిత ఇలా ఊహించని విధంగా నంబర్ 2 స్థానాన్ని సొంతం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. దీనికి కారణం నాగచైతన్య అనడంలో సందేహం లేదు. నాగచైతన్యతో సడన్గా నిశ్చితార్థం జరుపుకునే సరికి ఈమె బాగా పాపులర్ అయింది. చాలామంది అభిమానులు ఈమె గురించి తెలుసుకోవడానికి తెగ వెతికేశారు. అందులో భాగంగానే ఈ స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
శోభిత – నాగచైతన్య ప్రేమ, నిశ్చితార్థం.
వీరిద్దరి పరిచయం ప్రేమ విషయానికొస్తే 2022 నుండి వీరిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా వీటిని ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో అందరూ నిజంగానే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఆగస్టు 8వ తేదీన సడన్గా నిశ్చితార్థం ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ జంట. నాగార్జున కూడా ఈ జంట నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమకు చాలా సంతోషంగా ఉందని, కొత్త కోడలు రాక తమ కుటుంబాలలో సంతోషాన్ని నింపబోతోంది అంటూ తెలిపారు. ఏది ఏమైనా అక్కినేని కోడలు కాబోతున్న శోభిత ఇప్పుడు బాగా పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.