Sobhita Dhulipala : అక్కినేని వారి కాబోయే కోడలికి ఉన్న హ్యాబిట్ ఏంటో తెలుసా..? చైకి ఇక చుక్కలే !

Sobhita dhulipala.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాలలో ఒకటైన అక్కినేని కుటుంబం (అక్కినేని family) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. కానీ ఆయన వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఒకవైపు తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, మరొకవైపు వైవాహిక జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.

sobhita-dhulipala-do-you-know-the-habit-of-akkinenis-future-daughter-in-law-there-are-no-more-drops-for-chai
sobhita-dhulipala-do-you-know-the-habit-of-akkinenis-future-daughter-in-law-there-are-no-more-drops-for-chai

నిశ్చితార్థంతో ఒక్కటైన నాగచైతన్య – శోభిత ..

అందులో భాగంగానే నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాలతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. రెండేళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ.. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో వివాహం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున షేర్ చేస్తూ అధికారికం చేసేసారు. ఆ తర్వాత నాగచైతన్య, శోభిత ల నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

అక్కినేని కోడలు మంచి ఫుడీ లా వుందే..

ఇక ఈ ఫొటోస్ కొన్ని రోజులపాటు బాగా వైరల్ గా మారాయి. అయితే నాగచైతన్య పెళ్లి ఫారిన్లో జరుగుతుందని కొద్ది రోజులు వార్తలు రాగా, మరికొకసారి డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా ఎటువంటి ప్లాన్స్ చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా శోభితకు చెందిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అక్కినేని కొత్త కోడలు బాగా లాగించేస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవైపు ఫుల్ లంచ్ మీల్స్, నూడుల్స్ తింటున్న ఫోటోతో పాటు ఈమె కాఫీ చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ అక్కినేని కోడలు మంచి ఫుడీ లా ఉందే అంటూ కామెంట్లు చేస్తూ, లైక్ కొడుతూ షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా అక్కినేని కొత్త కోడలు ఫుల్లుగా లాగించేస్తూ భోజన ప్రియురాలు అనిపించుకుంటోంది.

- Advertisement -

శోభిత కెరియర్..

ఇక శోభిత విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండవ స్థానం సొంతం చేసుకుని.. 2013 లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలో భారతదేశం తరఫున పాల్గొనింది. ఇక ఈమె తెనాలిలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె లిటిల్ ఏంజెల్స్ స్కూల్ విశాఖపట్నం, విశాఖ వ్యాలీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజ్ లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసిన ఈమె సంప్రదాయాన్ని నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు