Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala), నాగచైతన్య (naga chaitanya) ప్రేమించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం జరిపించుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్, పారిస్ లో చేయాలని ఇరు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వీరి పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయి. ప్రస్తుతం శోభిత సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాల్లో నటిస్తోంది.
తాజాగా శోభితకు (Sobhita Dhulipala) రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్-3 చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని శోభిత తిరస్కరించింది. సినిమాలలో ఏదైనా పాత్రలో లేదా ఇతర పాటలలో నటిస్తాను కానీ ఐటమ్ సాంగ్స్ లో మాత్రం నటించనని స్పష్టంగా చెప్పిందట. తనకు పెళ్లి కుదిరిందని…. తనకు కాబోయే భర్త నాగచైతన్య అనుమతి లేకుండా, ఆయనకు ఇష్టం లేకుండా ఎలాంటి పనులు చేయనని చెప్పిందట. అక్కినేని లాంటి పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతున్నప్పుడు కెరీర్ పరంగా నాకు ఇబ్బంది రాకుండా, ఆ ఇంటికి ఎటువంటి చెడ్డ పేరు తీసుకు రాకుండా ఉండాలన్నది తన ఉద్దేశం అని శోభిత తన సన్నిహితులతో తెలియజేసిందట.
నాగచైతన్య (naga chaitanya) మొదటి భార్య సమంత (Samantha) పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ అనే పాటలో నటించింది. దాంతో సమంతపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. నాగ చైతన్యకు ఇష్టం లేకపోయినప్పటికీ కావాలనే సమంత ఇలా నటించిందని… సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అందుకే శోభిత దూళిపాళ అలాంటి తప్పు చేయకూడదని, ఎలాంటి ఐటమ్ సాంగ్స్ లలో నటించకూడదని…. జాగ్రత్తగా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.