Sj Surya: కొన్ని సినిమాలు ఊహించని మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. కొన్ని రీమేక్ సినిమాలుకు ఆల్రెడీ చూసిన తర్వాత కూడా చాలా ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో విజయ్ జ్యోతిక కలిసి నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భూమిక(Bhoomika) జంటగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా తమిళ్లో కంటే కూడా తెలుగులో అద్భుతంగా వర్కౌట్ అయింది. కొన్ని సినిమాలను రీమేక్ చేయకూడదు ఆ సినిమా ఒరిజినల్ లో ఉన్న ఫీల్ పోతుంది అంటారు. కానీ ఖుషి సినిమాకు సంబంధించి ఒరిజినల్ మించిన ఫీల్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ
ఖుషి సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాగానే ఉంది అని చెబుతూ ఉంటారు. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ను పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చాలా అందంగా ఈ సినిమాలో కనిపిస్తారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్ ఏంటి అని అడిగితే కచ్చితంగా ఖుషి(Khushi) అని చెప్తారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఒక పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ సర్వైవ్ అయ్యారు.
ఖుషి సీక్వెల్
ఎప్పటినుంచో ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమా సీక్వెల్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా సీక్వెల్ ఆల్రెడీ ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కి చెప్పాడు. అయితే దానికి ఖుషి అని టైటిల్ కాకుండా వేరే పేరు పెట్టి ఒక కథను చెప్పాడు. ఆల్ లవ్ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కి పిచ్చిపిచ్చిగా నచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ కి నచ్చిన కూడా సూర్య నేను ఇప్పుడు లవ్ స్టోరీలు చేసే ఏజ్ లో లేను ఆ ఫేజ్ నేను ఎప్పుడో దాటిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్.
ఈ జనరేషన్ లో ఖుషి
ఈ విషయాన్ని స్వయంగా ఎస్ జె సూర్య రీవిల్ చేశారు. ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ఈ సినిమాకి ఎవరు సరిగ్గా సరిపోతారు అని చెబుతూ తలపతి విజయ్(Thalapathy Vijay), నాని(Nani), రామ్ చరణ్(Ram Charan) పేర్లు చెప్పుకొచ్చాడు. అలానే హీరోయిన్ గా ప్రియాంక ఆరుళ్ మోహన్ కూడా బాగుంటుంది అని ఎస్ జె సూర్య తెలిపాడు. నటుడుగా ప్రస్తుతం ఎస్ జె సూర్య మంచి ఫామ్ లో ఉన్నాడు. నటుడుగా కంటిన్యూ చేస్తాడా లేదంటే మళ్ళీ డైరెక్షన్ వైపు అడుగులు వేస్తాడా తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడకు తప్పదు.