Sj Surya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఎస్ జె సూర్య ఒకరు. అయితే నటుడి కంటే ముందు ఎస్ జె సూర్య ఒక దర్శకుడిగా చాలామందికి పరిచయం. ఎస్ జె సూర్య దర్శకుడుగా కూడా మంచి హిట్ సినిమాలును అందుకున్నాడు. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య పరిచయం. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమాని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఇకపోతే తెలుగులో నాని అని మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించాడు సూర్య. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబుకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొమరం పులి అని ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
నటుడుగా గుర్తింపు
ఇక రీసెంట్ టైమ్స్ లో ఎస్ జె సూర్య నటుడుగా కూడా నిలదొక్కుకుంటున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు సూర్య. అలానే మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక విలన్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాతో సూర్యకి మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వస్తున్న తమిళ్ సినిమాల్లో కీలక పాత్రలలో కనిపిస్తున్నాడు. ఇక ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు సూర్య.
నానికి ధీటుగా
ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు ఎస్ జె సూర్య. అయితే ఈ సినిమాలో నానికి ఎంత మేరకు స్కోప్ ఉంటుందో అదే మాదిరిగా ఎస్ జె సూర్యకి కూడా ఉంటుంది అనేది సమాచారం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి అంచనాలను పెంచుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పలు ఇంటర్వ్యూస్ లో ఎస్ జె సూర్య కూడా పాల్గొంటున్నాడు. ఎస్ జె సూర్య ఇంటర్వ్యూలు ఈమధ్య వైరల్ గా మారుతున్నాయి. దీనికి కారణం ఎస్ జె సూర్య ఇంటర్వ్యూస్ లో పాటలు పాడటం అలానే స్టోరీ రివిల్ చేయటం వంటివి జరుగుతున్నాయి.
సినిమా కథని చెప్పేస్తున్నాడు
మామూలుగా కొంతమంది ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అని అడుగుతుంటారు. సినిమా కథను రివీల్ చేయకుండా కొంతమంది తమ పాత్రకు ఉన్న ప్రత్యేకతను చెబుతూ ఉంటారు. కానీ ఎస్ జె సూర్య మాత్రం అలాకాకుండా సరిపోదా శనివారం సినిమాకి సంబంధించిన కంప్లీట్ లైన్ ను కొన్ని ఇంటర్వ్యూస్ లో రివిల్ చేసేసాడు. అలానే రీసెంట్ గా జరిగిన సినిమా ఈవెంట్ లో కూడా కథను చెప్పేసాడు. ఇక సూర్య ఇలా చెప్పడంతో మానాడు సినిమాలో వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్ అనే సూర్య డైలాగ్స్ ని పెట్టి వచ్చాడు,స్టోరీ చెప్పాడు,పోతాడు, రిపీట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.