SIIMA 2024.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (SIIMA-2024).. సౌత్ సినీ సెలబ్రిటీలు ఎంతగానో ఎదురు చూస్తున్న సైమా అవార్డ్స్ వేడుక రానే వచ్చేసింది. ఈ ఈవెంట్ ను దుబాయ్ లో ఈ సెప్టెంబర్ 14 , 15వ తేదీలలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది దక్షిణాదిలో విడుదలయ్యి భారీ పాపులారిటీ సొంతం చేసుకుని, ప్రజల మన్ననలు అందుకున్న సినిమాలను , ఉత్తమ చిత్రాలుగా ప్రకటించడమే కాదు ఆ చిత్రాలలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులను ఎంపిక చేసి సైమా అవార్డ్స్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ ఇలా వివిధ భాగాలలో పలువురు విజేతలు అవార్డులు అందుకోవడం జరిగింది. ఇకపోతే సైమా 2024 తెలుగు అవార్డ్స్ విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బెస్ట్ సినిమా – బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి.
బెస్ట్ యాక్టర్ – నేచురల్ స్టార్ నాని (దసరా)
బెస్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల (దసరా)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ ( మేల్) – దీక్షిత్ శెట్టి (దసరా )
బెస్ట్ హీరోయిన్ – కీర్తి సురేష్ (దసరా)
బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) – సాయి రాజేష్ ( బేబీ)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్)- ఆనంద్ దేవరకొండ (బేబీ)
బెస్ట్ డెబ్యూ హీరోయిన్ – వైష్ణవి చైతన్య (బేబీ)
బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్ శ్రీరామ్ ( ఓ రెండు ప్రేమ – బేబీ)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ – సంగీత్ శోభన్ (మ్యాడ్)
బెస్ట్ కమెడియన్ – విష్ణు ఓయ్ ( మ్యాడ్)
బెస్ట్ హీరోయిన్ (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ ( హాయ్ నాన్న)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శౌర్యువ్ (హాయ్ నాన్న)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్ ) – బేబీ ఖియారా ఖన్నా ( హాయ్ నాన్న)
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ – వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – హేషం అబ్దుల్ వాహబ్ ( హాయ్ నాన్న ,ఖుషి)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – భువన గౌడ ( సలార్)
బెస్ట్ సింగర్ ( మేల్) – రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు – బలగం )
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ
వీరంతా కూడా తెలుగు సినిమాలో నటించి అద్భుత ప్రదర్శన కనబరచి సైమా అవార్డును సొంతం చేసుకున్నారు.
స్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన సెలబ్రిటీస్..
అత్యంత అట్టహాసంగా ఘనంగా దుబాయ్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాజరైన సెలబ్రిటీలను మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలాగే తమను మరింత పాపులారిటీ సొంతం చేసుకోవడానికి జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా స్టేజ్ పై డాన్స్ పర్ఫార్మ్ చేసి అందరినీ ఆకట్టుకుంది. వీరితోపాటు ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ శ్రేయ శరణ్ కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరొకసారి ఆడియన్స్ ను అలరించింది. ఇక శాన్వి కూడా డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. ఏది ఏమైనా తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ లో ఘనంగా జరుగుతోంది. ఇక తమ అభిమాన నటీనటులకు అవార్డ్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.