TelusuKada : సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా నుండి క్రేజీ అప్డేట్!

Telusukada : టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డీజే టిల్లుతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో, ఈ ఇయర్ టిల్లు స్క్వేర్ (Tillu Squere) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సిద్ధూ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలుండగా, ఒకే సారి రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న జాక్ సినిమాలో నటిస్తూనే, మరో వైపు తాను హీరోగా నటిస్తున్న “తెలుసుకదా” (TelusuKada) షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాను ఓ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Siddhu Jonnalagadda Starrer TelusuKada Movie Latest Update

శరవేగంగా తెలుసుకదా సినిమా షెడ్యూల్..

ఇక సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న “తెలుసు కదా” సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్ “నీరజ కోన” (Neeraja kona) దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా (Rashi khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య విడుదలైన గ్లిమ్ప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమా షూటింగ్ కి కొంతకాలం బ్రేక్ పడింది. అయితే తిరిగి మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. గత నెల ఆగష్టు 5 నుండి 20 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ చేసిన మేకర్స్, మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి మేకర్స్ తాజా సమాచారం ఇచ్చారు.

- Advertisement -

తెలుసుకాదా నుండి లేటెస్ట్ అప్డేట్..

ఇక సిద్ధూ నటిస్తున్న “తెలుసు కదా” సినిమా నుండి మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా యొక్క షూటింగ్, ఈ మంత్ లాంగ్ షెడ్యూల్ తో 50 శాతం పూర్తయిందని అనౌన్స్ చేసారు. సెట్స్ లో ఉన్న హీరోహీరోయిన్ల ఫోటోలు షేర్ చేస్తూ ఈ అనౌన్స్ మెంట్ చేసారు మేకర్స్. ఇక తెలుసు కదా సినిమాకు థమన్.ఎస్ (Thaman S) సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్ గా జె.యువరాజ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌ గా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ శ్రీకర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ అప్డేట్ ని అతి త్వరలోనే అందచేస్తామని మేకర్స్ ప్రకటించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు