Iphone 16 : టెక్నికల్ యుగంలో ప్రతి ఒక్కరు అప్డేట్ గా ఉండాలి అని అనుకుంటారు. సెలబ్రిటీలు కూడా దీనికి తక్కువేం కాదు. ముఖ్యంగా ఐఫోన్ విషయంలో ప్రతి ఒక్కరు అప్డేట్ గా ఉండాలి అని అనుకుంటారు. వచ్చే ప్రతి లెటెస్ట్ వెర్షన్ మొబైల్ తమ దగ్గర ఉండాలి అని కోరుకుంటారు. ఇలా సెలబ్రిటీలు కూడా అనుకోవడం సాధరణ విషయమే. ఇక రీసెంట్‌గా ఐఫోన్ 16 లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫ్యూచర్స్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ఇది పక్కన పెడితే… రీసెంట్‌గా లాంఛ్ అయిన ఐఫోన్ 16 (Iphone 16)ని ఓ సెలబ్రిటీ కపుల్ కొనుగోలు చేసింది. ఇది పెద్ద న్యూస్ అవ్వకపోవచ్చు. కానీ, ఐఫోన్ 16ని కొనుగోలు చేసిన ఫస్ట్ సెలబ్రిటీ కపులు మాత్రం వీళ్లే. అది ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్ధాం…
ఐఫోన్ 16 సోమవారం గ్రాండ్ గా లాంఛ్ అయింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐఫోన్ 16ని ఆ కంపెనీ సీఈవో టీమ్ కుక్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ భారీ ఈవెంట్ ను కూడా జరిపారు. అయితే ఈ ఈవెంట్ కి సెలబ్రిటీ కపులు సిద్ధార్థ్ (Siddharth) – అదితి రావు ( Aditi Rao Hydari ) హైదరి హజరయ్యారు. ఈవెంట్‌లో ఆపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ తో సరదాగా మాట్లాడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాదు, ఈ ఐఫోన్ 16ని ఈ జంట కోనుగోలు కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ – అదితి రియాక్షన్
దీంతో సోమవారం రిలీజ్ అయిన ఐఫోన్ 16ని ఫస్ట్ కొనుగోలు చేసిన సెలబ్రిటీ కపులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాగా ఈ ఫోటోలతో పాటు సిద్ధార్థ్ – అదితి రావు హైదరీ రాసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ” ఇది మర్చిపోలేని, అద్భుతమైన అనుభవం. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎంతో కూల్ గా మాట్లాడారు. ఈ రెండు రోజులు మాకు చాలా స్పెషల్. యాపిల్ టీమ్ తో మా చుట్టు క్రియేటివిటీ, టెక్నాలజీ ఉంది” అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
సిద్దార్థ్ – అదితి లవ్
హీరో సిద్ధార్థ్ ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపాడు. కొన్ని బయటికి రాగా, కొన్ని ఇంకా సీక్రెట్ గానే ఉన్నాయి. అయితే సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితి రావు హైదరీతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు లవ్ లో ఉన్న ఈ జంట రీసెంట్‌గా ఎంగేజ్ మెంట్ ను కూడా చేసుకుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కాగా, ఈ ఇద్దరు మహా సముద్రం అనే సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram