Shyam Prasad reddy.. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి బుధవారం స్వర్గస్తులయ్యారు. ఈమె దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే. సోదరి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారట. ఆమె కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా స్వర్గస్తురాలైనట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు అనే పూర్తి వివరాలు ఏవి ఇంకా తెలియ రాలేదు. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి, ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భార్య అయిన వరలక్ష్మి మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు, టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్యాన్సర్ తో పోరాటం..
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (62) గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారట. చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె కోలుకోలేక బుధవారం తుది శ్వాస విడిచారు.
శ్యాం ప్రసాద్ రెడ్డి వైవాహిక జీవితం..
ప్రముఖ సినీ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురైన వరలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెరియర్..
అమెరికాలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈయన సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం కోసమే తిరిగి ఇండియాకి వచ్చారు. నటించాలని కోరిక ఈయనలో చాలా ఎక్కువగా ఉండేదట ఆసక్తి ఆయనను సినిమా నిర్మాతగా మార్చేసింది. ముఖ్యంగా ఎంఎస్ రెడ్డి ఫ్రెండ్లీ అసోసియేట్ శ్రీ రామోజీరావు నిర్మాతగా సినిమా స్ట్రీమ్ లోకి అడుగుపెట్టమని శ్యాం ప్రసాద్ రెడ్డికి సూచించారట ఇక అందులో భాగంగానే దిగ్గజ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట ఆ తర్వాత పీఎం రామచంద్రరావు ప్రొడక్షన్ హౌస్ లో ప్రొడక్షన్స్ గెలిచి నేర్చుకుని 18 రోజుల నిర్మాణ వివదిలోని తలంబ్రాలు అనే కాన్సెప్ట్ తో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
నిర్మాతగా సక్సెస్..
ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వివిరామంగా కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శ్యాం ప్రసాద్ రెడ్డి ఎవరో కాదు చిత్ర రచయిత చిత్ర నిర్మాత అయిన ఎస్ఎం రెడ్డి కుమారుడు. జీవితంలో ఎప్పుడూ ఒకటే మాటే తన శిష్యులకు చెబుతూ ఉంటారట శ్యాంప్రసాద్ రెడ్డి నువ్వు పరిగెత్తగలిగినప్పుడు ఎందుకు నడవాలి అంటూ చెబుతూ ఉంటారట. ఇక ఆ దృష్టి కోణంలో ఆలోచించిన శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం నిర్మాతగా ఉర్దూత స్థాయిలో వడ్డారని చెప్పవచ్చు.
టీవీ షోలు..
శ్యాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు అదే చానల్లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ జోడి షో కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జీన్స్, అదుర్స్ , క్యాష్ , స్టార్ మహిళ వంటి కార్యక్రమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా ఈయన నిర్మించిన సినిమాల విషయానికొస్తే.. అమ్మోరు, అరుంధతి, అంజి లాంటి చిత్రాలు ఈయన గ్రాఫికల్ ప్రవాహానికి అద్దం పడతాయి. ఒకసారి టర్మినేటర్ -2 జడ్జిమెంట్ డే అనే సినిమా చూసిన ఈయన, తెలుగులో కూడా ఇలాంటి చిత్రాలు ఎందుకు చేయకూడదు అని ఆలోచించారట. ఆ ప్రేరణతోనే ఆయన మొదటి గ్రాఫికల్ చిత్రంగా అమ్మోరు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా కథపరంగా డిజాస్టర్ అయినా ఇందులో గ్రాఫికల్ ఎఫెక్ట్స్ కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు కూడా లభించింది.