Shubman Gill: టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) గురించి ప్రత్యేకంగా క్రికెట్ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గిల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అతి తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ తీరుతో ఫేమస్ అయ్యాడు. ఎన్నో విజయాలను సాధించిన గిల్ క్రికెట్ తోనే కాకుండా తన ప్రేమ వ్యవహారాలతో మరింత ఫేమస్ అయ్యాడు. సినీ తారలకు, క్రికెటర్లకు ఎఫైర్లు ఉండడం సర్వసాధారణం. ఎప్పటినుంచో ఇలాంటి వాటిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్లు, ఇండియన్ క్రికెటర్ల మధ్య ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ వ్యవహారాలు చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ గిల్, అవనీత్ కౌర్ (Avneet Kaur ) అనే ఓ బాలీవుడ్ హీరోయిన్ తో తిరుగుతున్నాడని అనేక రకాల వార్తల వస్తున్నాయి. ఆదివారం రోజున గిల్ పుట్టినరోజు వేడుక జరిగింది. అయితే ఈ వేడుకలో అవనీత్ కౌర్ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోని నటి అవనీత్ కౌర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను షేర్ చేసుకుంది. అందులో గిల్, అవనీత్ కౌర్ ఇద్దరూ కలిసి కనిపించారు.
ఈ ఫోటోకి అవనీత్ కౌర్ క్యాప్షన్ కూడా జత చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎంతోమంది వ్యక్తులకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. మీ గురించి నేను గర్వపడుతున్నట్టుగా వెల్లడించారు. దీంతో గిల్, అవ్‌నీత్ కౌర్ మధ్య రిలేషన్ ఉన్నట్లు అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు 2023 సంవత్సరంలో వీరిద్దరూ కలిసి లండన్ లో కనిపించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా, అవనీత్ కౌర్ భారతదేశానికి చెందిన మోడల్, నటి, డాన్సర్ కూడా. మొదట టీవీ షోస్, సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2014లో విడుదలైన మర్దానీ సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవనీత్ కౌర్ వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.
ఈ క్రమంలోనే భారత స్టార్ క్రికెటర్ గిల్ (Shubman Gill), అవినీతికౌర్ మధ్య రిలేషన్ ఉన్నట్లు అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్టుల్లో గిల్, బాలీవుడ్ నటి అనన్య పాండేతో ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ క్రమంలో అనన్యతో కూడా డేటింగ్ చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు గిల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ హీరోయిన్లు డేటింగ్ వార్తలపై ఇలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం గిల్ క్రికెట్ కెరియర్ విషయానికి వస్తే…. గిల్ దులీప్ ట్రోఫీ 2024 ఆడుతున్నాడు. ఇందులో గిల్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా బంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు భారత జట్టులో గిల్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత గిల్ ఏ సిరీస్ లో ఆడతారో చూడాలి.