Shraddha Srinath : టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు చేసే హీరోయిన్లలో ఈమె ఒకరు. ఎక్కడో జమ్మూ నుండి వచ్చిన ఈ హీరోయిన్ ముందుగా కన్నడ, తమిళ సినిమాల్లో నటించగా, తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాతో హీరొయిన్ గా పరిచయం అయింది. తెలుగులో మొదటి సినిమాతోనే తనదైన నటనతో ఇంప్రెస్ చేసిన ఈ భామ, ఆ తర్వాత జోడి అనే సినిమా, అలాగే సిద్ధూ జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలో నటించింది. అయితే ఆ తర్వాత తమిళ్ లో బిజీ అయింది ఈ భామ. ఇక చాలా రోజులకు రీసెంట్ గా తెలుగులో ‘సైన్ధవ్’ లో నటించింది. అయితే ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు ఈ భామ.
ప్లాప్ తర్వాత సైలెంట్ అయిన శ్రద్ధా…
తెలుగులో నానితో జెర్సీ (Jersey) చేసాక, మళ్ళీ రెండే సినిమాల్లో నటించిన శ్రీ లీల మళ్ళీ తెలుగులో నటించలేదు. అయితే నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో వెంకటేష్ సైన్ధవ్ (Saindhav) సినిమాలో నటించగా, ఆ సినిమా ప్లాప్ అయింది. దాంతో శ్రద్ధా శ్రీనాథ్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు. దీంతో ఆఫర్లు రాక శ్రద్ధా సైలెంట్ అయిపోయిందనుకున్నారు. కానీ తన ప్లానింగ్ లో తానుందని తర్వాత తెలిసింది. వెంకటేష్ తో చేసిన సినిమా ప్లాప్ అయ్యాక, కాస్త గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) చేతిలో అరడజను ప్రాజెక్ట్ లు ఉన్నాయని సమాచారం.
వరుస ప్రాజెక్ట్ లతో బిజీ…
ఇక శ్రద్ధా శ్రీనాథ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయని సమాచారం. అందులో ఒకటి తెలుగులో విశ్వక్ సేన్ (Vishwak sen) తో నటిస్తున్న మెకానిక్ రాకీ (Mechanic Rocky) ఉండగా, మిగతా అన్ని ప్రాజెక్ట్ లు ఇతర భాషలకి చెందినవే ఉన్నాయి. తమిళ్ లో కలియుగం, ఆర్యన్, హిందీలో గోద్రా, లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, అలాగే ఇంకా టైటిల్ పెట్టని మరో హిందీ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాల్లో ఈ ఒక్కటి క్లిక్ అయినా అమ్మడు మళ్ళీ ఫుల్ యాక్టీవ్ అవుతుంది. ఇక తెలుగులో విశ్వక్ తో నటిస్తున్న మెకానిక్ రాకి దీపావళి రిలీజ్ కి సిద్ధం అవుతుంది.