Shraddha Srinath.. ఇటీవల కాలంలో హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మీడియాతో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్(Tollywood ) ను మొదలుకొని బాలీవుడ్ (Bollywood ) వరకు ప్రతి ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ వున్న విషయం తెలిసిందే. అందుకే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లాగా జస్టిస్ హేమ కమిటీ లాంటి కమిటీని అన్ని భాషా ఇండస్ట్రీలలో కూడా వేయాలని చాలామంది హీరోయిన్లు కోరుతున్నారు. ప్రత్యేకించి పాన్ ఇండియా హీరోయిన్స్ అయిన సమంత (Samantha ), అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా ఈ విషయంపై స్పందించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) కూడా స్పందించారు.
క్యాస్టింగ్ కౌచ్ పై శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. అందరూ క్యాస్టింగ్ బాధితులే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కదా.. నేనెప్పుడూ కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కోలేదు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో కూడా నేను పనిచేశాను. అక్కడ పార్టీలకు కూడా వెళ్లి వచ్చాను. అయితే ఎవరు నాతో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ముఖ్యంగా నేను నా చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండేదానిని. ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే అలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాను. అందుకే ఎప్పుడూ నాకు ఇండస్ట్రీలో వేధింపులు ఎదురుకాలేదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాను.
సెట్ లో మహిళలకు పారిశుద్ధ్య సౌకర్యాలు తప్పనిసరి..
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో మహిళలకు కావలసిన పారిశుద్ధ్య సౌకర్యాలు ఉండవు. అలాంటి కనీస అవసరాలు కచ్చితంగా ఉండేలాగా చిత్ర బృందం చూసుకోవాలి. హేమా కమిటీ రిపోర్ట్ చూసి నేను ఆశ్చర్యపోయాను ముఖ్యంగా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఎవరితో చర్చించాలో తెలియక తమలో తామే మదన పడిపోతున్నారు. ఇక పరిశ్రమలో వేధింపులు ఆగాలి అంటే కరెక్ట్ గా వర్క్ చేసే సంస్థలు రావాలి అంటూ తన మాటగా చెప్పుకొచ్చింది శ్రద్ధ శ్రీనాథ్. ఇక ఈమె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్ .
శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వస్తే.. ఇండియన్ మోడల్ గా, సినిమా నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఎక్కువగా నటించింది. మలయాళం లో వచ్చిన కోహినూర్ అనే సినిమా ద్వారా 2015లో సినీ రంగ ప్రవేశం చేసిన శ్రద్ధ , 2016 లో వచ్చిన కన్నడ చిత్రం యూటర్న్ సినిమాతో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది .ఇక తెలుగులో నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల, సైంధవ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది శ్రద్ధ శ్రీనాథ్. ప్రస్తుతం తమిళ్ , హిందీ చిత్రాలతో బిజీగా మారింది.