Artist Pragathi : టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అమ్మ పాత్రలకు కేరాఫ్ గా ఉండే మంచి పాత్రలు చేసే ఈమె, రీసెంట్ సోషల్ మీడియా ద్వారా పలు విషయాల్లో ట్రోలింగ్ కి గురవగా, లేటెస్ట్ గా ప్రగతిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే… టాలీవుడ్ లో ఆగష్టు 15న పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఒక్కో సినిమా ఒక్కో రకమైన టాక్ ని సొంతం చేసుకోగా, డబుల్ ఇస్మార్ట్ (Double ismart) అయితే డిజాస్టర్ టాక్ ని అందుకుంది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ హౌస్ ఫుల్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన డబుల్ ఇస్మార్ట్ ఈవెనింగ్ కల్లా పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకోగా, రెండో రోజు నుండే థియేటర్లో ఈగలు తోలుకోవాల్సన పరిస్థితి వస్తుంది. ఇక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మూస ధోరణి డైరెక్షన్ కి తోడు రామ్ క్యారెక్టర్ పాత ఇస్మార్ట్ శంకర్ ని మరిపించే విధంగా లేకపోగా, ఈ సినిమాలో కాస్త శృతిమించినట్టయింది.
ప్రగతి పాత్రపై విమర్శలు…
ఇక ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ పై తీవ్రమైన నెగిటివిటి వస్తుండగా, అందులో సీనియర్ కమెడియన్ అలీ, అలాగే ఆర్టిస్ట్ ప్రగతి పాత్రలపై ట్రోలింగ్, విమర్శలు స్టార్ట్ అయ్యాయి. అలీ పాత్ర అయితే ఒక రకమైన బోల్డ్ కామెడీ పాత్రగా రాసుకోగా, నెట్టింట ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమా జాతీయ స్థాయికి ఎదిగాక ఇలాంటి సినిమాలు, ఇలాంటి చెత్త పాత్రలు ఎలా తీయాలి అనిపిస్తుంది అని నెట్టింట తెలుగు సినీ ప్రేక్షకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలీ పాత్ర మొత్తం బూతు పదాలతోనే నింపేశారు మేకర్స్. ఇక సీనియర్ ఆర్టిస్ట్ ప్రగతికి విషయానికి వస్తే.. అలీని మించి ఈమెని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. డబుల్ ఇస్మార్ట్ లో ఇలాంటి పాత్ర ఎందుకు వేయాల్సి వచ్చిందో ఏమో గాని ప్రగతి సినీ కెరీర్ ముందు ముందు ఒక క్వశ్చన్ మార్క్ అయ్యేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.
ఎలాంటి రోల్స్ చేసేవారు.. ఎలా అయిపోయారు..
అయితే ఆర్టిస్ట్ ప్రగతిని (Pragathi) తెరపై ఒకప్పుడు చూస్తే ఒక మంచి అమ్మ లాంటి పాత్రలే గుర్తొస్తాయి. హీరోహీరోయిన్లకు ఒక ఫ్రెండ్లీ మదర్ రోల్స్, లేదా ఒక గైడెన్స్ ఇచ్చే అమ్మ లాంటి పాత్రలు చేసేవారు. కొన్ని సినిమాల్లో ఆమె తల్లి పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వారు. కానీ కొంత కాలంగా నటి ప్రగతికి ఏర్పడ్డ ఇమేజ్ వేరని చెప్పాలి. ముఖ్యంగా లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో ప్రగతి జిమ్ వర్కౌట్ వీడియోలు, రకరకాల ఫోటోలు, వీడియోలతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిందని చెప్పాలి. అప్పటి నుండే ఆడియన్స్ లో ఒకరకమైన నెగిటివిటి స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఆమె చేస్తున్న పాత్రలు కూడా అలాగే ఉన్నాయని చెప్పాలి.
డబుల్ ఇస్మార్ట్ లో ప్రగతి కారెక్టర్ కూడా దారుణంగా ఉందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఈ సినిమాలో ప్రగతిని పాత్రను డైరెక్టర్ చూపించిన విధానానికి నెట్టింట జనాలు నవ్వుకుంటున్నారు. ఆమె గెటప్, లుక్స్ కి తోడు, ప్రగతి ఓవరాక్షన్ కు జనాలు థియేటర్లో కామెడీగా నవ్వుతున్నారు. అసలు ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు ఆమెకు ఇస్తున్నా జనాలు ఒప్పుకోవడం లేదు. అసలు ఇలాంటి పాత్ర ప్రగతి ఎలా ఒప్పుకుందో, దీంట్లో డైరెక్టర్ తప్పో, ఆమె తప్పో తెలీదు గాని, ఇండస్ట్రీలో ప్రగతి సినీ కెరీర్ సాఫీగా సాగడం ఇక డౌటే అన్న మాట వినిపిస్తుంది.