Meiyazhagan : కార్తీ సినిమా తెలుగు వెర్షన్ కి క్యాచీ టైటిల్!

Meiyazhagan : కోలీవుడ్ స్టార్ కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోగా అభిమానులను సంపాదించుకున్న కార్తీ (Karthi), సూర్య తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అభిమానులని సంపాదించాడు. రెండేళ్ల కింద పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో భారీ హిట్లు సాధించిన కార్తీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో జపాన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా కార్తీ ’96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Satyam Sundaram title for the Telugu version of Meiyazhagan

కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో…

ఇక కార్తీ హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమాను 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై కార్తీ అన్న, వదినలైన జ్యోతిక, సూర్య (Suriya) స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘మెయ్యళగన్’ (Meiyazhagan) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అర‌వింద్ స్వామి (Aravind Swamy) ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ చేస్తుండగా, ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ చూస్తుంటే.. కార్తీ, అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారని తెలుస్తూనే ఉంది. ఇక వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ని తెలిపే విధంగానే పోస్టర్లు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మరో పోస్టర్ ని వినాయకచవితి కానుకగా రిలీజ్ చేయగా, ఈ సినిమా తెలుగు వెర్షన్ టైటిల్ ని రిలీజ్ చేసారు.

- Advertisement -

సత్యం సుందరం గా కార్తీ, అరవింద్ స్వామి…

ఇక కార్తీ నటిస్తున్న ‘మెయ్యళగన్’ మరో పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా, ఈ సినిమా తెలుగు వెర్షన్ కి “సత్యం సుందరం” (Satyam Sundaram) అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు. కార్తీ, అరవింద్ స్వామి ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమాలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ కీలకపాత్రల్లో నటించారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు