SathyamSundaram Teaser : ఆకట్టుకుంటున్న ‘సత్యం సుందరం’ టీజర్.. కార్తీ ఈసారి కొత్తగా…

SathyamSundaram Teaser : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ జపాన్ తో ప్లాప్ అందుకున్న కార్తీ, వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ క్రమంలో కార్తీ ’96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ కొత్త సినిమాను 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై కార్తీ అన్న, వదినలైన జ్యోతిక, సూర్య (Suriya) స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇక కార్తీ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘మెయ్యళగన్’ (Meiyazhagan) అనే టైటిల్ పెట్టగా, తెలుగులో “సత్యం సుందరం” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇక ఈ సినిమాలో అర‌వింద్ స్వామి (Aravind Swamy) సెకండ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా “సత్యం సుందరం” టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.

Sathyam Sundaram Teaser Talk

స్వచ్ఛమైన స్నేహితుడి కథ…

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే కార్తీ, అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారని తెలిసింది. ఇక టీజర్ లో కూడా వారిద్దరి మధ్య సీన్లు చుపించగా, టీజర్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ లో కార్తీ, అరవింద్ స్వామి ను బావా అంటూ పిలుస్తూ, మంచి ఫన్ జెనరేట్ చేశాడు. ఈ టీజర్ ను చూస్తుంటే, ఒక ఫీల్ గుడ్ మూవీలా, ఎమోషనల్ డ్రామాగా తీసారని తెలుస్తూనే ఉంది. ఇక టీజర్ లో గోవింద్ వసంత అందించిన బీజీఎమ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో కార్తీ (Karthi) చాలా ఇన్నోసెంట్ గా నటించాడని అర్ధమవుతూనే ఉంది. కల్మషం లేని ఓ పల్లెటూరి వాడిలా ఈ సినిమాలో కార్తీని చూపిస్తున్నారు. కార్తీ కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

దసరా రిలీజ్ కి ప్లాన్…

అయితే సత్యం సుందరం టీజర్ తమిళ్ వెర్షన్ రెండు రోజుల ముందుగానే రిలీజ్ చేయగా, తెలుగు టీజర్ ని ఇప్పుడు రిలీజ్ చేసారు. ఇక కార్తీ, అరవింద్ స్వామి పాత్రలపైనే టీజర్ లో ఫోకస్ చేయగా, సినిమా కథ వాళ్లపైనే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచెల్ రెబెక్కా, ఆంథోనీ, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్ కీలకపాత్రల్లో నటించారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ సత్యం సుందరం సినిమాను సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు