Mathu Vadalara2 : టాలెంటెడ్ హీరో శ్రీ సింహ (Sri Simha) – కమెడియన్ సత్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ సినిమా “మత్తు వదలరా2″. ఐదేళ్ల కింద వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మత్తు వదలరా కి సీక్వెల్ గా “మత్తు వదలరా2” (Mathu Vadalara2) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకోగా, సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం జరిగింది. ఇక యూత్ లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండగా, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసారు. కాగా మత్తు వదలరా2 ఫైనల్ గా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని దూసుకుపోతుంది.
సినిమా మొత్తాన్ని నడిపించిన సత్య…
ఇక ఈరోజే థియేటర్లలో విడుదలైన మత్తు వదలరా2 సినిమా థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో కాకపోయినా, విడుదలైన అన్ని చోట్లా యానానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, హైదరాబాద్ లాంటి సిటీ ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించిన కమెడియన్ సత్య (Sathya) తన కామెడీతో కూడిన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్ (Vennela kishor) మంచి కామెడీ చేసినా, వీళ్లందరి కంటే ఎక్కువగా సత్య నవ్వించాడు. ఓ రకంగా సినిమా మొత్తాన్ని సత్య తన కామెడీతో నడిపించాడని కామెంట్స్ వస్తున్నాయి.
సత్య వాళ్ళ ప్లేస్ భర్తీ చేసినట్టే?
ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ల వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ల కిందట, బ్రహ్మానందం (Bramhanandam), సునీల్ (Suneel) వంటి కమెడియన్ల వళ్లే సినిమా ఆడిన రోజులున్నాయి. ఈ మధ్య కాలంలో వెన్నెల కిశోర్ మాత్రమే కమెడియన్ గా టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కొన్నాళ్ళు నవ్వించినా, నాన్ స్టాప్ గా నవ్వులు పూయించడం లేదు. ఇక సత్య ఇప్పుడు కమెడియన్లలో మళ్ళీ సునీల్ వంటి స్టార్ కమెడియన్ల స్థానాన్ని భర్తీ చేసేస్తాడని ప్రశంసలు వస్తున్నాయి. మరి సత్య ఇకముందు ఇక ముందు సినిమాల్లో కూడా ఈ రేంజ్ కామెడీతో నవ్విస్తూ, కమెడియన్ గా దూసుకుపోతాడా అనేది చూడాలి.