Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో ఈ పంద్రాగస్టు సినిమాల తరవాత రిలీజ్ కాబోయే పెద్ద సినిమా అంటే అది ‘సరిపోదా శనివారం’ సినిమా అనే చెప్పాలి. నాని కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి తర్వాత నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ కూడా ముగించుకుని, వరుస అప్డేట్స్, ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇక సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ట్రైలర్ బ్లాస్ట్ కి టైం ఫిక్స్…
ఇక ‘సరిపోదా శనివారం’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా డిఫరెంట్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మేకర్స్ నుండి ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఇది కూడా శనివారం నాడు రావడం విశేషం. సరిపోదా శనివారం మూవీ ట్రైలర్‌ను ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసారు. దీంతో ట్రైలర్ కోసం నాని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా వరుస ఇంటర్వ్యూలతో ప్లాన్ చేస్తున్నారు. నాని ఆల్రెడీ బుల్లితెరపై సరిపోదా శనివారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు.
The people of Sokulapalem are highly intrigued 😉
Presenting to you the adrenaline pumping #SaripodhaaSanivaaram Trailer on AUGUST 13th ❤️🔥#SuryasSaturday
— DVV Entertainment (@DVVMovies) August 10, 2024
భారీ తారాగణంతో సరిపోదా శనివారం…
దసరా, హాయ్ నాన్న వంటి సూపర్ హిట్ల తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్న నాని సరిపోదా శనివారంతో ఆ ఫీట్ సాధించేలానే ఉన్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు. సాయి కుమార్, అభిరామి, అజయ్ ఘోష్, కాళి, మార్టిన్, మురళీశర్మ, అజయ్, అదితి బాలన్ హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ చేస్తున్నారు. ఆగస్టు 29న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.