Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషల్లో మినహా అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ సాధించింది. మరీ యానానిమస్ రేంజ్ లో లేకపాపోయినా, రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో బెస్ట్ అనిపించుకోవడంతో మళ్ళీ థియేటర్ల వద్ద సందడి నెలకొని ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన సరిపోదా శనివారం తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ సాధించి స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) ఓ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది.
ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే.. శనివారమే బ్రేక్ ఈవెన్ కొట్టాడుగా..
ఇక సరిపోదా శనివారం రిలీజ్ రోజు నుండే మంచి హోల్డ్ చూపిస్తుండగా, ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చుపకపోయినా, తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రం అదిరిపోయాయని చెప్పాలి. ఇక తాజాగా సరిపోదా శనివారం ఓ ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది. నాని సినిమాలకు స్ట్రాంగ్ డిమాండ్ ఉండే ఓవర్సీస్ లోనే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పూర్తయిపోవడం విశేషం. సరిపోదా శనివారం ప్రీమియర్స్ తోనే ఓవర్సీస్ లో దుమ్ములేపేయగా, టోటల్ ఓవర్సీస్ లో వాల్యూ బిజినెస్ రేంజ్ 6 కోట్ల జరిగింది. ఇక మొదటి 2 రోజుల్లోనే 5.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు మరో కోటి రూపాయల వసూళ్లు సాధించేసి బ్రేక్ ఈవెన్ అయిపొయింది.
ఇక్కడ భారీ లాభాలు అందుకునే అవకాశం..
ఇక సరిపోదా శనివారం మూడు రోజుల్లో ఓవర్సీస్ లో 1.3 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. ఇకపై ఈ అక్కడ వచ్చేదంతా లాభమే. ఓవర్సీస్ లో సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram collections) సినిమా భారీ లాభాలు అందుకునే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా, దాదాపు 40 కోట్ల మార్క్ దాటేసిందని చెప్పాలి. ఇక సరిపోదా శనివారం సినిమాతో నాని మరో సక్సెస్ అందుకోవడం ఆల్మోస్ట్ ఖాయమైపోయిందని చెప్పాలి.