Saripodha Sanivaram: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా చేస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇదివరకే వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో నాని అంటే సుందరానికి(Ante Sundaraniki) అనే ఒక క్లాస్ సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ చవి చూసింది. అయితే ఈ సినిమా కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. అంత క్లాస్ మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఫిలింతో ప్రేక్షకులు ముందుకు రానుంది ఈ కాంబినేషన్.
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ హై ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే బాగా అల్లరి చేసే ఒక పిల్లోడిని రోజు కోప్పడటం మంచిది కాదు అని చెప్పి ఈ కోపాన్ని అంతా దాచిపెట్టుకొని శనివారం మాత్రమే నీ కోపాన్ని ప్రదర్శించు అని తన తల్లి చెబుతుంది. ఇక ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది.? అలా శనివారం వరకు కోపాన్ని దాచి పెట్టుకోవడం వలన ఏం జరుగుతుంది అనేటటువంటి కీలకమైన అంశాలు ఈ సినిమాలో చూపించనున్నాడు వివేక్. ఈ సినిమాపై నాని మంచి నమ్మకంతో ఉన్నాడు.
ఇకపోతే వివేక్ ఆత్రేయ మొదటిసారి ఒక యాక్షన్ ఫిలిం చేస్తున్నాడు తన కెరీర్లో. అయితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ కానుంది. ట్రైలర్ లో కూడా ఈ సినిమాలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకపాత్రను పోషించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఈ సినిమాను చూడటం పూర్తి చేశాడు హీరో నాని. ఇక క్లైమాక్స్ రోలింగ్ టైటిల్స్ ను పోస్ట్ చేస్తూ నా షో అయిపోయింది. మన షో రేపు మొదలవుతుంది అని వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ రోలింగ్ టైటిల్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు లాస్ట్ లో పోతారు, మొత్తం పోతారు అనే డైలాగ్ బాగా రిజిస్టర్ అవుతుంది.
My show is done ♥️
Our show begins tomorrow 🔥#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/UyQ1baDUFR— Nani (@NameisNani) August 28, 2024