Saripodha Saninvaram Trailer : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో వివేక్ ఆత్రేయ ఒకరు. మెంటల్ మదిలో సినిమాకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వివేక్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి హిట్ అయింది. వివేక్ – నాని కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమా అంటే సుందరానికి(Ante Sundaraniki). ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా చాలామంది ఈ సినిమాకి మంచి అభిమానులు ఉన్నారని చెప్పాలి.
వివేక్ ఆత్రేయ ఈ కథను డీల్ చేసిన విధానం చాలా మందికి విపరీతంగా నచ్చింది. లీలా – సుందరం మధ్య కొన్ని సీన్స్ ఇప్పటికే ఒక ప్రెస్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాయి. మూడు గంటల పాటు ఉండే ఈ సినిమా మంచి ఫీల్ ను క్యారీ చేసేలా ఉంటుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా రైటింగ్ స్క్రీన్ ప్లే అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత మంచి అటెంప్ట్ ఎందుకు ఫెయిల్ అయిందో చాలామందికి అర్థం కనీసం. అందుకే మళ్ళీ సేమ్ కాంబినేషన్లో ఈసారి పక్కా కమర్షియల్ హిట్ సినిమా చేయాలి అని తన రూట్ మార్చాడు వివేక్ ఆత్రేయ.
వివేక్ ఆత్రేయ( Vivek Atreya) సినిమాలు ఎంత సింపుల్ గా బ్యూటీగా ఉంటాయో అందరికీ తెలుసు. ఎంతో ఇష్టపడి చేసిన అంటే సుందరానికి సినిమా ఫెయిల్ అవ్వడంతో బహుశా ఆడియన్స్ కి ఒక మాస్ కమర్షియల్ సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అనుకోవచ్చు. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన సరిపోదా శనివారం (Saripodha Saninvaram Trailer) సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కొద్దిసేపటికితమైన రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.
ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నాని(Nani)కి ఎస్ జె సూర్య(SJ Surya) మధ్య ఉన్న సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ అవ్వనుంది. నాని పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటిలానే విజృంభించాడు.