Saree movie Teaser: బోల్డ్ కాదండోయ్ పైశాచికం.. క్రైమ్ స్టోరీ గా వర్మ స్కూల్ నుంచి సరికొత్త మూవీ..!

Saree movie Teaser.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) జానర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. 90వ దశకంలో కొత్త సినిమా యుగానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్లలో ఒకరైన దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూర దృష్టి కలవారు. ఇప్పటికి తాను చూసే ప్రపంచాన్ని ప్రశ్నించే, ప్రతిబింబించే, ప్రతిస్పందించే చిత్రాలను మాత్రమే ఆయన నిర్మిస్తారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కూడా అన్వేషించి అనేక చిత్రాలను రూపొందించారు కూడా.

శారీ టీజర్ అదుర్స్..

ముఖ్యంగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా డిఫరెంట్ కంటెంట్ తో కొత్తవారితో ప్రయోగాలు చేయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటారు అందులో భాగంగానే తాజాగా దర్శకుడిగా , నిర్మాతగా మారి శారీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శీర్షికగా టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అనే లైన్ కూడా జోడించారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నవంబర్లో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా, టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇన్ స్టా రీల్ తో హీరోయిన్ ను వెతికి పట్టుకున్న వర్మ..

ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయి ఎవరు అంటూ అభిమానులను సైతం అడుగుతూ ఎట్టకేలకు ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయితో ఏకంగా సినిమానే తీస్తున్నారు రాజమౌళి. ఆమెకు తాను పెట్టుకున్న పేరు ఆరాధ్య దేవి. కానీ ఆ అమ్మాయి పేరు శ్రీ లక్ష్మీ సతీష్. ఇందులో సత్య యాదు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల మేల వింపుతో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా శారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

- Advertisement -

నిజజీవిత సంఘటనల ఆధారంగా శారీ మూవీ..

ఇప్పటికే అమ్మాయిలపై ఎన్నో యాసిడ్ దాడులు మనం చూసే ఉన్నాం. అంతేకాదు ఉత్తరప్రదేశ్ లో ఒక ” శారీ కిల్లర్ ” అమాయకులైన, ఎంతోమంది ఆడవారిని అతి క్రూరంగా అనుభవించి, చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేయడం జరిగింది. ఆ మానవ మృగాడి కి మగువలపై ఎంతటి తీవ్రమైన కాంక్ష ఉందో, వాడి చర్యలే తెలియజేశాయి. ఆ అంశాల ఆధారంగానే ఇప్పుడు శారీ అనే చిత్రాన్ని రూపొందించారు. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడైన ఆ వ్యక్తి.. ఆమెతో ప్రేమలో పడి ఎంతో హానికరంగా, డేంజరస్ గా మారితే.. ఆ వ్యక్తి జీవితం ఎలా భయానకంగా వుంటుంది అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్.

Saree movie Teaser: Not a Bold..it's psycho.. As a crime story, the latest movie from Verma School..!
Saree movie Teaser: Not a Bold..it’s psycho.. As a crime story, the latest movie from Verma School..!

శారీ కిల్లర్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న టీజర్..

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా శబరి పని చేయగా, నిర్మాతగా రవి వర్మ, దర్శకుడిగా గిరి కృష్ణ కమల్ సినిమా కోసం పనిచేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయగా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తున్నారంటే బోల్డ్ కంటెంట్ తో వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇక్కడ బోల్డ్ సన్నివేశాలను పక్కన పెడితే, అసలు ఏం జరుగుతోంది అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే వర్మ స్కూల్ నుంచి వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు