Sandeep Reddy Vanga: డ్యూరేషన్ గురించి మీరు మాట్లాడటం ఏంటయ్యా.?

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అనుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని ప్రశంసలు సాధించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఒక సంచలనమని చెప్పాలి. అప్పట్లో రాంగోపాల్ వర్మ తీసిన శివ సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో సేమ్ అదే స్థాయిలో ఈ సినిమా కూడా ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా విషయానికొస్తే ఈ సినిమా డ్యూరేషన్ దాదాపు మూడు గంటలు దాటి ఉంటుంది.

ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచిందని చెప్పాలి. ఇకపోతే ఈ టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ మూడు గంటలకు పైగా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాను ఈ డ్యూరేషన్ తో రిలీజ్ చేస్తే ప్లాప్ అవుతుంది. అని చాలామంది చెప్పినా కూడా సందీప్ రెడ్డి వంగా నేను ఈ సినిమాని కట్ చేస్తే అది సూపర్ ప్లాప్ అవుతుంది, అనే కాన్ఫిడెంట్ తో మూడు గంటలు డ్యూరేషన్ తో సినిమాను రిలీజ్ చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ కట్ దాదాపు నాలుగు గంటలకు పైగా వచ్చిందని పలు సందర్భాల్లో సందీప్ రెడ్డి చెబుతూ వచ్చాడు.

దేవర టీం తో సందీప్ రెడ్డి ఇంటర్వ్యూ

ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన మూడువ సినిమా అనిమల్ ఈ సినిమా కూడా దాదాపు మూడు గంటలకు పైగా ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది అంతేకాకుండా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానుంది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు మూడు గంటలకు పైగానే ఉన్నాయి. ఈ తరుణంలో దేవరా సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కారణంగా ఆ టీం ని ఇంటర్వ్యూ చేశాడు సందీప్ రెడ్డి.

- Advertisement -

Devara

రన్ టైం గురించి మీరు మాట్లాడుతున్నారా.?

ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఈ ప్రోమోలో దేవర సినిమా డ్యూరేషన్ ఎంత అని సందీప్ రెడ్డి వంగ క్వశ్చన్ చేశారు. దీనికి కొరటాల శివ స్పందిస్తూ డ్యూరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారా అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. అలానే ఎన్టీఆర్ మాట్లాడుతూ అనిమల్ సినిమా డ్యూరేషన్ ఎంత అని అడిగారు. ఇకపోతే సందీప్ రెడ్డి మూడు గంటల పాటు సినిమా తీసినా కూడా ఆసక్తికరంగా ఆడియన్స్ ని కూర్చుని పెట్టగలిగాడు అని ఒప్పుకుని తీరాలి. ఇక దేవర సినిమాకు సంబంధించి డ్యూరేషన్ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు