Sandeep Reddy vanga: సందీప్ మోసం చేశాడు.. అదిల్ హుస్సేన్ షాకింగ్ కామెంట్స్..!

Sandeep Reddy vanga..సందీప్ రెడ్డి వంగ.. సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఇదే సినిమాలో హిందీలో కూడా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా హిందీలో యానిమల్ చిత్రం చేసి భారీ కలెక్షన్లతో పాటు సూపర్ హిట్ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయనకు భారీగా పేరు లభించింది అని చెప్పాలి. తాజాగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను హీరోగా పెట్టి స్పిరిట్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్. ఇదిలా ఉండగా ఈయన చేసిన సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈయనకు డిమాండ్ ఏర్పడింది.. అందుకే సందీప్ సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటే.. అదే సమయంలో ఆయనను వివాదాలు కూడా చుట్టుముట్టడం ఇప్పుడు సహజంగా మారిపోయింది..

సందీప్ పై అదిల్ షాకింగ్ కామెంట్స్..

Sandeep Reddy vanga: Sandeep cheated.. Adil Hussain's shocking comments..!
Sandeep Reddy vanga: Sandeep cheated.. Adil Hussain’s shocking comments..!

తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ సందీప్ రెడ్డి వంగా పై చేసిన కామెంట్లు సర్వత్ర వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళితే కబీర్ సింగ్ సినిమాలో కాలేజీ డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్ .. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందీప్ పై పలు రకాల కామెంట్లు చేశారు.. సందీప్ రూ .100 నుండి రూ.200 కోట్లు ఇచ్చిన యానిమల్ చిత్రంలో చేసేవాడిని కాదు.. అలాంటివి ఇక ఎప్పటికీ చేయను అని ఆయన తెలిపారు ..ఇక మళ్లీ ఎందుకు సందీప్ ని అదిల్ హుస్సేన్ గెలుకుతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా గతంలో ఈ వివాదం ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో అదిల్ .. సందీప్ దర్శకత్వంలో వచ్చిన కబీర్ సింగ్ సినిమాను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అదిల్ హుస్సేన్ .

సందీప్ నన్ను మోసం చేశాడు..

ఈయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు నా సినీ కెరియర్ లో ఎందుకు నటించానా ? అని ఫీలైన చిత్రం కబీర్ సింగ్. ఆ సినిమాలో నేను కాలేజీ డీన్ గా పనిచేశాను. ఎన్నోసార్లు నో చెప్పినా. ఒకే ఒక రోజు షూట్ కి రమ్మని అడిగారు.. పెద్ద మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు.. దాంతో వెళ్లి వాళ్ళు చెప్పిన సీన్ లో నటించి వచ్చేసాను. అయితే నటించినప్పుడు ఆ సీన్ బాగానే అనిపించింది..సినిమా కూడా బాగుంటుంది అని అనుకున్నాను.. సినిమా విడుదలయ్యాక ఆ సినిమా చూసి ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించాను అని ఇబ్బందికరంగా ఫీలయ్యాను.. నా స్నేహితులతో కలిసి సినిమా చూడ్డానికి వెళ్తే .. అక్కడ మధ్యలోనే బయటికి వచ్చేసాను.. ఇక నా భార్యను కూడా ఈ సినిమా చూడమని చెప్పలేదు.. ఒకవేళ ఆమె కనక నన్ను చూసి ఉంటే కచ్చితంగా తిట్టేది.. ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చి నన్ను మోసం చేశాడు అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

అదిల్ కామెంట్స్ కి సందీప్ చెక్..

అయితే ఈ విషయాలు సందీప్ దృష్టికి రాగా ఆయన.. మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా అని ఫీల్ అవుతున్న ఈ ఒక్క బ్లాక్ బాస్టర్ తోనే మీ సొంతం అయ్యింది.. నటనపై అభిరుచి కంటే డబ్బు పైన వ్యామోహం ఎక్కువగా ఉండడంవల్లే మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు ఇప్పుడు బాధ కలుగుతుంది.. సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తాను.. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సహాయంతో ఫిల్ చేస్తాను అంటూ పోస్టుతో క్లారిటీ ఇచ్చారు.

రూ.200 కోట్లు ఇచ్చినా నటించను..

అదిల్ మాట్లాడుతూ.. ఆయనేమైనా తైవాన్ డైరెక్టర్ ఆంగ్ లీ కన్నా ఫేమస్ అనుకుంటున్నాడా.. ఆ రేంజ్ లో ఊహించుకుంటే నేనేం చేయలేను.. కబీర్ సింగ్ కలెక్షన్లు కూడా నాకు తెలియదు.. కానీ ఆంగ్ లీ తెరకెక్కించిన లైఫ్ ఆఫ్ పై సినిమా ఏకంగా రూ.5000 కోట్లకు పైగానే రాబట్టింది.. ఈ లెక్కల్ని ఆయన సాధిస్తాడని అనుకోవడం లేదు. ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది ఇక రూ.200 కోట్లు ఇచ్చిన నేను ఆయన చేసిన యానిమల్ సినిమాలో నటించే వాడిని కాదు అంటూ తెలిపారు అదిల్. మొత్తానికైతే తన కెరియర్ లో ఒక చెత్త సినిమాలో ఆఫర్ ఇచ్చి తనను మోసం చేశాడు అంటూ చెప్పుకొచ్చారు అదిల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు