Sandeep Kishan : హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి… ఇవేం పాడు పనులు భయ్యా?

Sandeep Kishan : ఎంచక్కా వీకెండ్స్ ఫ్రెండ్స్ తో కలిసి లేదా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్లో కడుపునిండా భోజనం చేయాలి అని అందరూ అనుకుంటారు. కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న కొన్ని విషయాలను చూస్తుంటే బయట భోజనం అంటేనే భయం పట్టుకునేలా ఉంది. సాధారణంగా రోడ్లపై ఫుడ్ అంటే నీట్ నెస్ సరిగ్గా ఉండదేమోనని భయంతో రేట్లు ఎక్కువైనా సరే రెస్టారెంట్ లోనే తినడానికి ఇష్టపడతారు కొంతమంది. కానీ అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ కంటే దారుణంగా పరిస్థితులు ఉన్నాయని తెలిస్తే ఏమవుతారో పాపం బయట ఫుడ్ లవర్స్. తాజాగా సందీప్ కిషన్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేయగా, పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవేం పాడు పనులు భయ్యా?

వర్షాకాలం వచ్చేసింది దోమలతో పాటు బయట ఫుడ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్లు, హోటల్లలో తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. అందులో ఫుడ్ ఎలా ఉంది ? నాసిరకం పదార్థాలు వాడుతున్నారా? నిల్వ ఉంచిన మాంసాన్ని వండుతున్నారా ? కిచెన్ క్లీన్ గా ఉందా అనే విషయాలను పరిశీలించి, రూల్స్ విరుద్ధంగా నడుపుతున్న రెస్టారెంట్లను సీజ్ చేసే పారేస్తున్నారు. అధికారులు హైదరాబాద్ లో ఉన్న హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ ను కూడా ఇలాగే తనిఖీ చేయగా అందులో విస్తపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Image

- Advertisement -

ఈ తనిఖీల్లో అధికారులు సందీప్ కిషన్ రెస్టారెంట్ వివాహ భోజనంబు లో నాసిరకం పదార్థాలను వాడుతున్నట్టుగా గుర్తించారు. 2022 నాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ను గుర్తించారు. వాటితో పాటే 500 గ్రాముల కొబ్బరి తురుములో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి వండుతున్నారు. అంతేకాకుండా అప్పటికే వండేసిన ఫుడ్ ను స్టీల్ గిన్నెలో పెట్టి ఉంచారని, వాటికి అవసరమైన లేబుల్స్ లేవని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. అంతేకాదండోయ్ కిచెన్లో చెత్త బుట్టలకు ఉండాల్సిన మూతలు ఎక్కడా కనిపించలేదు. మరో దారుణమైన విషయం ఏమిటంటే కిచెన్ ప్రాంతంలో డ్రెయిన్ నీరు నిల్వ ఉండడం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఫుడ్ హ్యాండిల్ చేసే హోటల్ ఎంప్లాయిస్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పత్రాలు కూడా లేవని, అక్కడ వంటలు వండడానికి వాటర్ బబుల్ వాడుతున్నారని వెల్లడించారు.

వివాహ భోజనంబు ఫుల్ పాపులర్

ఇక ప్రముఖ టాలీవుడ్ నటుడైన సందీప్ కిషన్ సినిమాలు చేస్తూనే ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. చాలా కాలం క్రితమే వివాహ భోజనంబు పేరుతో సికింద్రాబాద్లో రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ వంటకాలు చాలా ఫేమస్. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన నిజాలు చూస్తుంటే ఈ రెస్టారెంట్ మూతపడడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు