Samyuktha Menon : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో “సంయుక్త మీనన్” ఒకరు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మాయి, రెండేళ్ల కింద భీమ్లా నాయక్ (Bheemla nayak) సినిమాతో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో తనదైన శైలిలో ఆకట్టుకోగా, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత సార్, విరూపాక్ష సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని గోల్డెన్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డెవిల్ తో డిజాస్టర్ అందుకుని ఒక్కసారిగా సైలెంట్ అయిపొయింది. అయితే ప్లాప్ రావడంతో సంయుక్తకు ఆఫర్లు కరువయ్యాయని అందరూ అనుకున్నారు.
అరడజను సినిమాలు లైన్లో పెట్టిన సంయుక్త..
అయితే సంయుక్త మీనన్ (Samyuktha Menon) డెవిల్ డిజాస్టర్ తర్వాత చల్లబడ్డా వెంటనే పుంజుకుంది. సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయకున్నా, వరుస భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తాజాగా తన బర్త్ డే సందర్బంగా పలు సినిమాల నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసారు మేకర్స్. ఇక సంయుక్త చేతిలో ఏకంగా అరడజను సినిమాలుండగా, ఒక్క తెలుగులోనే మూడు సినిమాలున్నాయి. ఇక తెలుగులో ప్రస్తుతం నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా “స్వయంభు”(Swayambhu) లో హీరోయిన్ గా నటిస్తుండగా, తాజాగా ఆ సినిమాలో సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సంయుక్త ఒక వారియర్ లుక్ లో చేతిలో విల్లు బాణంతో ఉండి ఆకట్టుకుంటుంది.
బిజీ బిజీగా సంయుక్త…
ఇక సంయుక్త స్వయంభుతో పాటు, శర్వానంద్ 37వ (Sharwa37) సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమా (BSS11)లో కూడా హీరోయిన్ గా సంయుక్త నటిస్తుంది. అలాగే హిందీలో మహారాగ్ని – క్వీన్ అఫ్ క్వీన్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళంలో ,మోహన్ లాల్ నటిస్తున్న “రామ్” సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అలాగే ఓ తమిళ్ ప్రాజెక్ట్ లోనూ నటిస్తుంది. ఇలా చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో సంయుక్త బిజీగా ఉండగా, ఇందులో రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సంయుక్త మీనన్ తెలుగులో రానున్న రోజుల్లో తన స్టార్ డమ్ ని ఎలా కంటిన్యూ చేస్తుందో చూడాలి.