Samyuktha Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా రాణిస్తారు. అలాంటి వారిలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) ఒకరు. ఈ బ్యూటీ పాప్ కాన్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి భీమ్లా నాయక్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బింబిసారా, విరూపాక్ష, సార్ వంటి ఎన్నో రకాల సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీ హీరోయిన్ గా ఉంటుంది.
అంతేకాకుండా పెద్ద పెద్ద హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకుంటుంది. సంయుక్త సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ఈ మధ్య సంయుక్తకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోతుంది. అదే స్థాయిలో రూమర్స్ కూడా సంయుక్త పైన ఎక్కువగానే వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సంయుక్త ఓ రూమర్ బారిన పడింది. మొన్నటి వరకు సంయుక్త త్రివిక్రమ్ తో కలిసి రిలేషన్ కొనసాగిస్తున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సంయుక్త (Samyuktha Menon) ఓ తమిళ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిస్తుందని, అతనితో డేటింగ్ చేస్తున్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ హీరోతో కలిసి తమిళంలో సంయుక్త కొన్ని సినిమాల్లో నటించిందని… ఆ సినిమా వాళ్ళనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందట. ఇక వారిద్దరూ కలిసి నటించిన సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో పాటు బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టింది. అప్పటినుంచి మొదలైన వీరి పరిచయం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. త్వరలోనే వీరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ హీరోకి ఇంతకుముందే ఓ అమ్మాయితో వివాహం జరిగిందని ఏవో కొన్ని కారణాలవల్ల వారు విడిపోయారని సమాచారం.
ప్రస్తుతం సంయుక్త (Samyuktha Menon), తమిళ హీరో పీకల్లోకి ప్రేమలో మునిగితేలుతున్నారని, డేటింగ్ చేస్తున్నట్లు, వెకేషన్ కి వెళుతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీరి వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సంయుక్త తన సినిమాలతో అభిమానుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఇలాంటి సమయంలో వివాహం చేసుకుంటే సినిమాల పరంగా తన కెరీరకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆలోచిస్తుందట. మరి వీరిద్దరి వివాహం ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. సంయుక్త తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. ఆ ఫోటోల్లో చీరకట్టులో సాంప్రదాయంగా ముస్తాబు అయి తన అందాలను చూపకనే చూపిస్తూ కుర్రకారు గుండెల్లో సెగల పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.