Samantha.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత(Samantha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందచందాలతో అద్భుతమైన కథ ఎంపికలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన చిత్రాలతో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. ఇకపోతే ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వివాహం అనంతరం నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట 2021లో విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్..
ఇక విడాకుల తర్వాత ఎవరికీ వారు కెరియర్లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ఇటీవల ప్రముఖ హీరోయిన్ శోభిత(Sobhita dhulipala)తో ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు నాగార్జున. ఇక నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరు కూడా వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ చేశారు. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ ( Raj)అండ్ డీకే కాంబినేషన్లో గతంలో ఫ్యామిలీ మెన్ 2 తో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది సమంత. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమంత – రాజ్ మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. మరొకవైపు నాగచైతన్య – శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో ఇప్పుడు ఈమె రాజ్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజాగా సమంత ఒక్క పోస్ట్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందని చెప్పవచ్చు.
సెల్ఫీ పోస్టుతో ఫుల్ క్లారిటీ..
అయితే ఇది ఎలాంటి క్లారిటీ అంటే నోరు మెదపకుండానే ఒక్క ఫోటోతో అందరి నోర్లు మూయించింది అని చెప్పవచ్చు. తాజాగా ఈమె షేర్ చేసిన సెల్ఫీ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. సమంత షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే.. స్టైలిష్ లుక్ లో ఉన్న సెల్ఫీ ని సమంత పోస్ట్ చేశారు. దానిపై రాసిన కొటేషన్ ఈ ఫోటో, కి ఆమె జోడించిన పాట రెండూ అభిమానులను ఆకర్షిస్తున్నాయి “శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం” అనే కొటేషన్ ఆమె వేసుకున్న టీ షర్టుపై ఉండగా, దీనికి నౌ వి ఆర్ ఫ్రీ అనే ఒక ఇంగ్లీష్ పాటను జోడించారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
దీనిపై అభిమానులు రకరకాల కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ .. అందంగా ఉన్నారని ఒక నెటిజన్ ప్రశంసించగా, రాణి ఎప్పటికీ రాణి నే అని మరొక అభిమాని కామెంట్ చేశారు. అంతేకాదు ఈ కొటేషన్ కొందరికి సరైన సమాధానం అంటూ మరో అభిమాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షేర్ చేసిన తొలి ఫోటో ఇదే కావడంతో ఇలా రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి మొత్తానికైతే తాను చేసిన ఒక్క పోస్టుతో తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చినట్టు అయింది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram