Samantha Controversy : నువ్వు డాక్టర్ అయ్యుండొచ్చు గానీ… ది లివర్ డాక్ కి ఇచ్చిపడేసిన సమంత

Samantha Controversy : సమంత ఏ ముహూర్తన విడాకులు తీసుకుందో గానీ అప్పుడు మొదలైన బ్యాడ్ లక్ ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. విడాకుల తరువాత మయోసైటిస్ అంటూ ఆరోగ్యంపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే ఆమె నటించిన ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఇక తాజాగా హెల్త్ కు సంబంధించిన టిప్ ఇచ్చి వివాదంలో చిక్కుకుంది. అయితే ఆమె ఇచ్చింది కరెక్ట్ సలహా కాదని, అభిమానులను తప్పుదోవ పట్టిస్తుంది అంటూ ది లివర్ డాక్ అనే వైద్యుడు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు. అయితే తాజాగా సమంత నువ్వు డాక్టర్ కావచ్చు గానీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేసింది.

డాక్టర్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్

“ఒక పెద్దమనిషి నా పోస్ట్‌పై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. సదరు పెద్దమనిషి డాక్టర్ అని కూడా చెప్పాడు. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల దయ, కరుణతో ఉండేది” అంటూ సుధీర్ఘ సమాధానం ఇచ్చింది. ‘జైలులో పడేయాలి’ అంటూ ట్రోల్ చేసిన నెటిజన్లపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. “ఈ చికిత్సను MD, 25 సంవత్సరాల పాటు DRDOలో సేవలందించిన అత్యంత అర్హత కలిగిన వైద్యుడు నాకు సూచించాడు. అతను సంప్రదాయ వైద్యంలో తన పూర్తి విద్యను అభ్యసించిన తర్వాత, ప్రత్యామ్నాయ చికిత్సను సూచించాడు” అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది.

తన ట్రీట్‌మెంట్‌లను పంచుకున్నందుకు తనను 'జైలు' చేయాలనుకునే ట్రోల్‌పై సమంత నిందలు వేసింది; చదవండి

- Advertisement -

అసలు వివాదం ఏంటంటే?

జూలై 3న వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ తీసుకుంటున్న ఫోటోను సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసింది. “సాధారణ వైరల్‌కు ఔషధం తీసుకునే ముందు, ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రయత్నించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో నెబ్యులైజ్ చేయడం ఒక ఆప్షన్” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. వర్షాకాలం మొదలవ్వడంతో జలుబు, జ్వరాలు ఎక్కువ అవుతాయని, తన అభిప్రాయం ప్రకారం ఈ చికిత్స ఖచ్చితంగా పని చేస్తుందని ఆమె తన అభిమానులకు హామీ ఇచ్చింది. అయితే ఈ పోస్ట్ పై ఒక హెపటాలజిస్ట్‌ ఫైర్ అయ్యాడు.

లివర్ డాక్ అనే వ్యక్తి “రేషనల్లి, సైంటిఫికల్లీ ప్రగతిశీల సమాజంలో ఈ మహిళను ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు జరిమానా లేదా కటకటాల వెనుక ఉంచాలి. ఆమెకు సహాయం లేదా ఆమె బృందంలో మంచి సలహాదారు కావాలి” అంటూ మండిపడ్డాడు. దీంతో సమంతను టార్గెట్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అయితే ఆ వెంటనే సమంత అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ వివాదం ఇక్కడితో పూర్తవ్వలేదు. లివర్ డాక్ మళ్లీ రిప్లై ఇచ్చాడు.

సమంత రిప్లైపై డాక్టర్ రియాక్షన్

“దయచేసి గమనించండి, ఆమె ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చే విషయంలో సీరియల్ నేరస్థురాలు. తప్పుడు సమాచారంపై పోరాడటానికి నాలాంటి వైద్యులు మా బిజీ షెడ్యూల్‌ల నుండి సమయాన్ని వెచ్చించవలసి రావడానికి కారణం అవుతోంది. పైగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తోంది” అంటూ ఫైర్ అయ్యాడు డాక్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు