Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత (Samantha) ఏ మాయ చేసావే సినిమాతో (Em maya chesave) ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులను తన మాయలో పడేసింది. మొదటి సినిమాతోనే సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్పవచ్చు. సమంత నటనను చూసిన దర్శకనిర్మాతలు సమంత డేట్స్ కోసం క్యూలో ఉండేవారు. సమంత దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకుండా… నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటిస్తూ ఉండేది.
సమంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సమంత (Samantha) కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను (Naga Chaitanya) ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ అనంతరం నాలుగేళ్ల పాటు వారి వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగింది. కానీ సమంతకు మాత్రం వివాహం తర్వాత తన కెరియర్ కు కాస్త దెబ్బ పడిందనే చెప్పవచ్చు. పెద్ద కుటుంబానికి కోడలు అయిన కారణంతో సమంతతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు, హీరోలు కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. సినిమాలు అంటే తప్పకుండా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి అలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలో సమంతను పెట్టుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయని సినిమా అవకాశాలు ఎవ్వరూ ఇవ్వలేదు.
తక్కువ సినిమాల్లో మాత్రమే సమంత నటించింది. ఇక నాలుగేళ్ల తర్వాత నాగచైతన్య, సమంత (Samantha) ఏవో కొన్ని కారణాలతో విడాకులు తీసుకొని వేరుగా ఉన్నారు. విడాకుల అనంతరం సమంత కెరియర్ సినిమాల పరంగా మంచి పీక్స్ లో ఉంది. విడాకుల తర్వాత సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. అయితే నాగచైతన్య (Naga Chaitanya) మాత్రం శోభిత ధూళిపాళ్లతో (Shobitha) ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. వీరు కొన్నేళ్ళ నుంచి లవ్ రిలేషన్ కొనసాగించినట్లు సమాచారం. వీరి ఎంగేజ్మెంట్ విషయం తెలిసిన అనంతరం అభిమానులు సమంతకు సపోర్టుగా ఉన్నారు. నాగచైతన్య వివాహం చేసుకోవడంతో సమంతపై (Samantha) చాలామంది సానుభూతి చూపిస్తున్నారు.
ప్రస్తుతం సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సమంత ఎలాంటి సినిమాలు చేసిన, ఏ హీరోతో రొమాన్స్ చేసిన చాలామంది ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఖుషి సినిమా సమయంలోను ఇదే ట్రోలింగ్ ను ఎదుర్కొంది సమంత (Samantha). టాలీవుడ్ లో సినిమాలు మానేసి కేవలం బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రమే నటించాలని ఫిక్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి సమంత అభిమానులు షాక్ అవుతున్నారు.