Salman Khan : సెలబ్రిటీలు అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ కళ్ళ ముందు కదలాడుతుంది. ఖరీదైన బ్రాండ్ వాచ్ లు, కార్లు వంటివి కొనడానికి కోట్లు ఖర్చు పెట్టి వార్తల్లో నిలుస్తారు. ఇదే విధంగా తాజాగా సల్మాన్ ఖాన్ చేతికి అత్యంత ఖరీదైన ఒక వాచ్ గురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అద్భుతంగా ఉన్న ఆ వాచ్ ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం.
ఆ వాచ్ ధర ఎంతంటే?
సల్మాన్ ఖాన్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖరీదు 20 మిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ. 167 కోట్లు ఖరీదు చేసే వజ్రాలు పొదిగిన వాచ్ ను తన చేతికి పెట్టుకుని కన్పించారు. సల్మాన్‌కి సంబంధించిన ఈ క్లిప్‌ను ప్రముఖ అమెరికన్ జ్యువెలరీ డిజైనర్ జాకబ్ అరబో స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. లగ్జరీ వాచ్, జ్యువెలరీ బ్రాండ్ వ్యవస్థాపకుడు అరబో.. సల్మాన్ చేతికి ఈ కాస్ట్లీ గడియారాన్ని పెట్టుకున్న క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాకబ్ సల్మాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఈ పోస్ట్ చేశాడు. “నా బిలియనీర్ వాచ్ ను ధరించడానికి నేను ఎవరినీ అనుమతించలేదు. కానీ ఈ విషయంలో సల్మాన్ ఖాన్ మినహాయింపు’ అని పోస్ట్‌లో రాశాడు. ఈ గడియారం దాని గొప్పతనానికి, రికార్డు స్థాయి ధరకు ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన ‘బిలియనీర్’ అనే లగ్జరీ బ్రాండ్ కు సంబంధించినది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా, సల్మాన్ అభిమానులు “సల్మాన్ ఈ వాచ్ ధరిస్తే, ఈ వాచ్ వెలకట్టలేనిదిగా మారిందని అర్థం చేసుకోండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వాచ్ ప్రత్యేకతలు ఏంటంటే?
వాచ్ కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా ఈ వాచ్ లో 700 కంటే ఎక్కువ పచ్చ-కట్ వజ్రాలను పొదిగారు. ఈ వాచ్ చాలా లిమిటెడ్ సంఖ్యలో తయారు చేశారని సమాచారం. ఈ వాచ్ దాని ప్రత్యేకమైన డిజైన్, వజ్రాల సంఖ్య కారణంగా లగ్జరీ వాచ్ ల లిస్ట్ లో చేరింది.
సల్మాన్ కొన్నారా? ట్రై చేశారా?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తుంటే సల్మాన్ సైతం ఈ వాచ్ నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు. ఈ వాచ్‌ని ప్రదర్శిస్తూ ఫోజు కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహానికి సంబంధించినది అని అంటున్నారు. ఎందుకంటే ఆ వేడుకలో అతిథుల లిస్ట్ లో జాకబ్ కూడా ఉన్నారు. అయితే సల్మాన్ ఇప్పుడు ఈ వాచ్ ను కొన్నారా? లేదా ట్రై చేశారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ ఆయన గనుక ఈ వాచ్ ను కొంటే గనుక ఈ బ్రాండ్ వాచ్ లను కొన్న అతికొద్ది మంది సెలబ్రిటీల లిస్ట్ లో చేరినట్టే. ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, జే-జెడ్, డేవిడ్ బెక్‌హామ్ వంటి కొద్ది మంది స్టార్స్ దగ్గర మాత్రమే ఈ వాచ్ ఉంది అంటే ఆ వాచ్ ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు.