Salman Khan : బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ మాత్రమే హాజరు కాలేదు. కానీ ఆయన తమ్ముడు మలైకా మాజీ భర్త, కరీనా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఇంటికి రాకపోవడమే కాదు కనీసం అంత్యక్రియలలో కూడా కన్పించలేదు. మరి సల్లూ భాయ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం పదండి.
మలైకా తండ్రి సూసైడ్
మలైకా తండ్రి అనిల్ అరోరా బుధవారం కన్నుమూశారు. ముంబై పోలీసుల విచారణ ప్రకారం మలైకా అరోరా తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారని తేలింది. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. తన తండ్రి మరణ వార్త విన్న మలైకా అరోరా ముంబై చేరుకుని నేరుగా తన తండ్రి ఇంటికి వెళ్లింది. అలాగే పలువురు ప్రముఖులు కూడా హుటాహుటిన మలైకా అరోరా తండ్రి ఇంటికి చేరుకున్నారు. ఖాన్ కుటుంబానికి చెందిన పలువురు మలైకా పక్కనే ఉండి ఆమెను ఓదార్చారు. అయితే సల్మాన్ మాత్రం చివరిసారి నివాళులర్పించేందుకు రాలేదు. అంత్యక్రియలకే కాదు మలైకా ఇంటికి కూడా రాలేదు. సల్మాన్ ఖాన్ ఎందుకు రాలేదు? అతను రాకపోవడానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించనప్పటికీ, సల్మాన్ ముంబైకి దూరంగా ఉన్నాడని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ ఎక్కడ?
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న తన తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సికిందర్ సినిమా షూటింగ్ ఫోటోను షేర్ చేసింది. అలాగే సమాచారం ప్రకారం సల్మాన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ సికందర్ షూటింగ్లో ఉన్నాడు. బుధవారం రష్మిక తాను సికందర్ కోసం షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. ‘సికందర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘డే 1’ అంటూ రష్మిక ఓ ఫోటోను షేర్ చేసింది.
మరోవైపు అనిల్ అరోరా మరణం తర్వాత సల్మాన్ తల్లిదండ్రులు, తోబుట్టువులు మలైకాను పరామర్శించారు. అనిల్ అరోరా మరణ వార్త విన్న తరువాత సల్మాన్ సోదరుడు, అర్బాజ్ ఖాన్ అనిల్ ఇంటికి మొదట పరుగెత్తాడు. ఎందుకంటే ఆయన మలైకా మొదటి భర్త. అలాగే అంత్యక్రియలకు కూడా అర్బాజ్ తో పాటు ఆయన ప్రస్తుత భార్య షురా ఖాన్ కూడా హాజరయ్యారు. మలైకా, ఆమె సోదరి అమృతా అరోరా అంత్యక్రియల్లో అర్జున్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, గీతా కపూర్, టెరెన్స్ లూయిస్‌తో కలిసి పాల్గొన్నారు.
ఆత్మహత్యకు కారణం ఏమిటి?
ప్రాథమిక విచారణలో అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అంత్యక్రియాల తరువాత మలైకా సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. “మా ప్రియమైన తండ్రి అనిల్ అరోరా మరణించినందుకు మేము చాలా బాధపడ్డాము. అతను చాలా సౌమ్యుడు. ఆయన అంకితభావంగల తాత, ప్రేమగల భర్త, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ నష్టంతో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్లిష్ట సమయంలో మేము మీడియా, శ్రేయోభిలాషుల నుండి ప్రైవసీని అభ్యర్థిస్తున్నాము. మీ సపోర్ట్, ప్రేమకు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది.