S.S.Thaman.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. థమన్ (S.S.Thaman)ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు సంగీత దర్శకుడిగా పని చేస్తూనే, మరొకవైపు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి జడ్జిగా వ్యవహరిస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా షోలో భాగంగా అనుష్కతో తనకున్న రిలేషన్ గురించి అలాగే భాగమతి సీక్వెల్ గురించి క్లారిటీ ఇస్తూ ఊహించని కామెంట్స్ చేశారు థమన్.
ప్రతి సెప్టెంబర్ అనుష్క నుంచి ఐఫోన్ వస్తుంది – థమన్
ఎస్ ఎస్ థమన్ మాట్లాడుతూ.. అనుష్క గురించి ఆమె వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెతో భాగమతి సినిమా చేసేటప్పుడు నేను ఆమె సినిమాకు సంగీతాన్ని అందించాను.అప్పటినుంచి మా మధ్య పరిచయం మరింత పెరిగిపోయింది. ఆమె బ్యూటీ విత్ హార్ట్. ఆమె అంటే చాలా ఇష్టం. నేను చూసిన హీరోయిన్లలో ఆమె వన్ ఆఫ్ ద బెస్ట్.ఈమె ఒక హీరోయిన్ అని చెప్పలేను కానీ ఈమె వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన క్యారెక్టర్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నాకు ఆమె నుంచి ఒక ఐఫోన్ వస్తుంది. ఆపిల్ నుంచి వచ్చే ప్రతి సిరీస్ కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది కదా ఆ కొత్త ఫోన్ నాకు అనుష్క పంపిస్తుంది. ప్రస్తుతం నేను వాడుతున్న ఐఫోన్ కూడా ఆమె పంపించిందే అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు థమన్.
భాగమతి 2 కూడా రాబోతోంది..
భాగమతి సినిమా అప్పుడు నేను గాడ్జెట్ ఫ్రీక్ అని చెప్పాను. ఇక అప్పుడు భాగమతి హిట్ అయితే ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఐఫోన్ రిలీజ్ అయిన వెంటనే ఒక ఫోన్ పంపిస్తానని ప్రామిస్ చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు నాకు ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఆమె నుంచి ఐఫోన్ వస్తోంది అంటూ తెలిపారు. ప్రస్తుతం భాగమతి 2 పనులు కూడా సైలెంట్ గా వేగంగా జరిగిపోతున్నాయి అంటూ చెప్పి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు థమన్.
అనుష్క కెరియర్..
అనుష్క విషయానికి వస్తే.. తెలుగులో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె అప్పట్లోనే అరుంధతి సినిమాతో స్టార్ హీరో రేంజ్ లో భారీ హిట్ అందుకొని పెద్ద హీరోల రికార్డులను సైతం బ్రేక్ చేసింది.
ఇలా టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే మళ్ళీ అనుష్క తొలి ఛాయిస్ గా మారిపోయింది. అక్కడి నుంచి అనుష్క చాలా హిట్స్ కొట్టింది కానీ అరుంధతి తర్వాత ఆమెపై సోలోగా వచ్చి సాలిడ్ అయిన సినిమా భాగమతి అని చెప్పవచ్చు. 2018లో సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. బాహుబలి సినిమా తర్వాత తన నుంచి వచ్చిన పర్ఫెక్ట్ సినిమాగా ఇది నిలిచిపోయింది. అయితే ఇప్పుడు సైలెంట్ గా ఈ సినిమా సీక్వెల్ పనులు మొదలుపెట్టారు మేకర్స్. ప్రస్తుతం అనుష్క దర్శకుడు క్రిష్ తో ఘాటి అనే సినిమా చేస్తుండగా, దీంతోపాటు భాగమతి 2 కూడా త్వరలోనే రాబోతోందని స్పష్టం చేశారు. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ జి అశోక్ తెరకెక్కిస్తుండగా, పార్ట్ 2 కి కూడా తానే మ్యూజిక్ అందిస్తున్నట్లు తెలిపారు.
#AnushkaShetty is My Life, She is Gold, Very Lovely Human.
We are Working on #Bhaagamathie 2 🔥
She is Fantastic Character, Beauty is Inside. She is Most Sweetest. Every Year September, I Get an IPhone from Her as She Promised.
– @MusicThaman 😍❤️🔥 pic.twitter.com/GhK73j2Z2I— Sweety Cults ❤️ (@AnushkaCults) September 15, 2024