Richest Heroine.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే అత్యధిక ధనవంతులైన హీరోలను మనం చూసాం. ఎందుకంటే వీరికి పారితోషకం ఎక్కువ. పైగా వీరు పలు యాడ్స్ , వ్యాపార రంగాల ద్వారా భారీగా సంపాదిస్తూ ఉంటారు. పైగా సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం కూడా ఎక్కువే. మరొకవైపు హీరోయిన్స్ కి రూ .10 నుంచి రూ . 12 కోట్లకు మించి పారితోషకం ఇవ్వరు. ఒకటి రెండు యాడ్స్ లో నటించినా హీరోల రేంజ్ లో పారితోషకం వీరికి రాదు. వీరికి ఇండస్ట్రీలో లైఫ్ టైం కూడా తక్కువే. అలాంటిది ఒక హీరోయిన్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి, ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యధిక ధనవంతురాలిగా నిలిచింది. ముఖ్యంగా ఈమె ఆస్తి విలువ కూడా వేల కోట్లు ఉంటుందని సమాచారం . మరి ఆమె ఎవరు? ఇంత డబ్బు ఎలా సంపాదించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక ధనవంతురాలు..
ఆమె ఎవరో కాదు జూహీ చావ్లా(Juhi Chawla).. తాజాగా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 జాబితా రిలీజ్ కాగా,అందులో ఆమె రూ.4,600 కోట్ల సంపదతో రిచెస్ట్ హీరోయిన్ గా నిలిచింది. బాలీవుడ్ లో ఒకప్పుడు అందం , అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ జూహీ చావ్లా, తాజాగా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో చోటు సొంతం చేసుకుంది. సినిమా సెలబ్రిటీల నుంచి షారుక్ ఖాన్ (Sharukh Khan) తో పాటు చోటు సంపాదించుకున్న ఏకైక నటిగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ వంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉండడం నిజంగా విశేషం అని చెప్పవచ్చు.
15 ఏళ్లుగా నటనకు దూరం.. కానీ రూ.4,600 కోట్ల సంపద.
15 ఏళ్లుగా అసలు సినిమాలే చేయలేదు. కానీ ఈమె ఆస్తి విలువ రూ.4600 కోట్లు అంటే నిజంగా నమ్మశక్యం కాదు. నిజానికి ఈ లిస్టులో కనీసం రూ.1000 కోట్లకు పైగా సంపదున్న భారతీయులకు చోటు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి దాదాపు 220 మంది కొత్త వారు చేరగా, మొత్తం ఈ జాబితాలో 1539 మంది ఇందులో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఏకంగా రూ.7300 కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన సెలబ్రిటీగా నిలవగా, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి జూహీ చావ్లా నిలవడం గమనార్హం.
ఎలా ఇంత సంపాదించింది..
1990లో హిందీ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె అమీర్ ఖాన్(Amir Khan)హీరోగా నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. పదేళ్లకు పైగా ఎన్నో హిట్టు చిత్రాలలో నటించిన ఈమె 2000వ సంవత్సరం తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి డ్రీమ్స్ అన్లిమిటెడ్ అని, ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో షారుఖ్ ఖాన్ తో కలిసి సినిమాలో నిర్మిస్తోంది. చివరిగా 2009లో వచ్చిన లక్ బై ఛాన్స్ సినిమాలో నటించిన ఈమె , ఆ తర్వాత నటనకు పూర్తిగా స్వస్తి పలికి ఒకవైపు సినిమా నిర్మాణం తో పాటు మరొకవైపు కోల్కతా నైట్ రైడర్స్ ఐపిఎల్ ఫ్రాంచైజీ లో కూడా వాటా దక్కించుకుంది. ఏది ఏమైనా ఈమె ఆస్తి విలువ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.