Regina Cassandra : ఎప్పుడో చేసిన ఈ ఒక్క సినిమాకోసం బాగానే కష్టపడుతుంది.. ఫలితం దక్కుతుందా?

Regina Cassandra : టాలీవుడ్ హీరోయిన్ రెజినా కాసాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెన్నైకి చెందిన ఈ సుందరి తెలుగులో ‘శివ మనసులో శృతి’ (SMS) అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజినా సక్సెస్ మాత్రం అందుకోలేదు. తొలి సక్సెస్ కోసం రెండేళ్లకు పైగానే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో సక్సెస్ అందుకున్న రెజీనా, ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కొన్నాళ్ల వరకు బాగానే సక్సెస్ లు కూడా అందుకున్నా, ఆ తర్వాత వరుస పరాజయాలతో ఫేడ్ అవుట్ అయింది. ఐదేళ్ల కింద తెలుగులో ఎవరు సినిమాలో నెగిటివ్ రోల్ చేసి సక్సెస్ అందుకున్న రెజీనా ఆ తర్వాత సక్సెస్ అందుకోలేదు.

Regina Cassandra starrer Utsavam will release in theaters tomorrow

వరుస ప్లాపులతో చెన్నై చెక్కేసిన చిన్నది…

ఇక రెజీనా కసాండ్రా (Regina Cassandra ) లాక్ డౌన్ తరువాత దాదాపు సినిమాలు తగ్గించేయగా, ఒక్క సక్సెస్ కూడా రాలేదని చెప్పాలి. అందుకే చెన్నై కి షిఫ్ట్ అయింది. అక్కడ మొదట్లో అవకాశాలొచ్చినా, అక్కడ కూడా సక్సెస్ లేకపోయే సరికి మళ్ళీ టాలీవుడ్ కి రావాలని ఆశపడుతోంది. కానీ ఇక్కడ ఆఫర్లు మాత్రం పలకరించడం లేదు. అడపాదడపా స్పెషల్ సాంగ్స్ మాత్రం చేస్తూ తానున్నానని గుర్తు చేస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ “నేనే నా?” అనే ఓ హారర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళ్ లో హిందీలో చెరో సినిమాలో నటిస్తుండగా, రెండింట్లో కూడా హీరోయిన్ పాత్ర మాత్రం కాదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా రెజీనా ఎప్పుడో నటించిన తెలుగు సినిమా కోసం ఇప్పుడు బాగా ప్రమోట్ చేస్తుంది.

- Advertisement -

ఉత్సవంపైనే రెజీనా ఆశలన్నీ?

ఇక రెజీనా కాసాండ్రా ఆ మధ్య తెలుగులో “ఉత్సవం” (Utsavam) అనే సినిమా చేసింది. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హార్న్ బిల్ పిక్చర్స్ బ్యానర్ లో సురేష్ పాటిల్ నిర్మించారు. ఇందులో దిలీప్ ప్రకాష్ (Dileep Prakash) హీరో గా నటించగా, రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటించింది. అయితే నాటక రంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కావడంతో ఈ సినిమాలో 90స్ కి చెందిన భారీ తారాగణం నటించారు. ఏడాది కిందే సినిమా ఫినిష్ అయిన ఈ సినిమా ఫైనల్ గా రేపు సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అయితే ఇన్ని రోజులు టాలీవుడ్ లో కనిపించని రెజీనా మళ్ళీ చాలా రోజులకు ఈ సినిమా కోసం ప్రమోషన్లు చేస్తుంది. చూస్తుంటే ఏ అవకాశాలు లేకపోవడంతో ఈ సినిమా సక్సెస్ అయితే మళ్ళీ టాలీవుడ్ లో పాగా వేయాలని రెజీనా చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే రెండు వారాలుగా ఈ సినిమాకోసం హైదరాబాద్ లో ఉంటూ రెజీనా ప్రమోషన్లలో పాల్గొంటుంది. రెజీనా కష్టానికి సినిమా సక్సెస్ రూపంలో ఫలితం లభిస్తుందా లేదా చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు