Raviteja : ఆక్సిడెంట్ తర్వాత వైరల్ అవుతున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ స్టిల్..

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రీసెంట్ గా పంద్రాగస్టున రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ తో చేసిన ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోగా, సినిమా భారీ నష్టాలను అందుకుంది. అయితే రవితేజ ఆ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తన 75వ సినిమా (RT75) చేస్తున్నాడు. శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో రవితేజ చేతికి ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ గాయంతోనే దాదాపు ఆ షూటింగ్లో పాల్గొన్నాడు రవితేజ. ఈ క్రమంలో ఆ గాయం కాస్తా సీరియస్ కాగా వెంటనే యశోదా హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ ఇచ్చారు.

Raviteja latest still is going viral on social media

ఆక్సిడెంట్ తర్వాత వైరల్ అవుతున్న రవితేజ స్టిల్…

ఇక రవితేజకు (Raviteja) జరిగిన ఆక్సిడెంట్ లో కుడి చేతికి గాయం కాగా, యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఆరు వారాలపాటు రవితేజ విశ్రాంతి తీసుకోవాలని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసారు. అయితే తాజాగా రవితేజకు ఆక్సిడెంట్ జరిగిన మూడు వారాల తర్వాత, రవితేజ లేటెస్ట్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ స్టిల్ లో డైరెక్టర్ బాబి (Bobby) రవితేజ తో ఉండగా, రవితేజ చేతికి ఇంకా కట్టు ఉన్నట్టు తెలుస్తుంది. చేతిని పెద్దగా యూజ్ చేస్తున్నట్టు లేడు. ఇకపోతే డైరెక్టర్ బాబీ రవితేజని కలవడానికి కారణం ఉంది.

- Advertisement -

డైరెక్టర్ గా “పవర్” తో బేబీ పదేళ్లు పూర్తి..

ఇకపోతే రవితేజ – బాబి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా “పవర్” (Power). ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా, అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే బాబీ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఇక పవర్ సినిమా విడుదలై నేటికీ పదేళ్లు (12 సెప్టెంబర్) పూర్తయిన సందర్బంగా డైరెక్టర్ బాబీ రవితేజని కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా బయటికి వచ్చిన రవితేజ స్టిల్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక బాబీ ప్రస్తుతం బాలయ్య తో (NBK109) ఓ సినిమా చేస్తుండగా, రవితేజ భాను భోగవరపు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు