Filmify Exclusive :టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకుంది. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ ఇప్పుడు ఎక్కడ వినిపించలేదు. సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. ఇక రవితేజ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త సినిమాలను లైన్లో పెడుతుంటాడు. ఇప్పుడు గ్యాప్ లేకుండా మరో సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా గురించి ఫిల్మీ పై కు సమాచారం అందింది. ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇటీవల వచ్చిన ఈగల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక నిన్న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కూడా యావరేజ్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. గత ఉగాది సందర్బంగా రవితేజ 75వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ‘సామజవరగమన’ సినిమాకు రచయితగా పనిచేసిన భాను బొగ్గవరపు ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సారి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు రవితేజ. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది పక్కా తెలంగాణ స్లాంగ్ తో రవితేజ రాబోతున్నట్టు పోస్టర్ లో చూపించేసారు. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ సినిమా కథ మాత్రమే కాదు.. రవితేజ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ మూవీలో కనిపిస్తున్నాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే సంక్రాంతి 2025కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు కూడా వాళ్ళ సినిమాలని అనౌన్స్ చేశారు. ఆ బరిలో ఇప్పుడు రవితేజ కూడా చేరాడు. ఈ సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టేశారు టీమ్.. త్వరలోనే షూటింగ్ గురించి అప్డేట్ ను ఇవ్వనున్నారని సమాచారం. మిస్టర్ బచ్చన్ సినిమా దెబ్బేసింది. మరి ఈ సినిమా అన్నా మనోడికి హిట్ ను అందిస్తుందని ఆశిద్దాం.. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను ఆయన లైన్లో పెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమాల గురించి అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్..