Mr. Bachchan : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్.. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడొచ్చిన సినిమా కు ఫ్యాన్స్ ను నిరాశ పరిచినట్లు తెలుస్తుంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై రవితేజ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. జగపతి బాబు విలన్గా నటించిన ఈ మూవీ నేడు (ఆగస్టు 15) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాదారణంగా వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుందని అంటే భారీ అంచనాలే ఉంటాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ కాలేక పోయింది. నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాల హరీష్ ఈ తెరకేక్కించారని తెరకెక్కించారని మాస్ మహారాజ అభిమానులు మండిపడుతున్నారు.
ఎలాంటి రీమేక్ సినిమా అయినా హరీశ్ తెరకేక్కిస్తారని ఈయనకు మంచి పేరు ఉంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది లేదని తెలుస్తుంది. సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే.. దాన్ని పక్కన బెట్టి.. పాటలు, వాటి కోసమే స్టోరీ అన్నట్లుగా రాసుకున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమాకు మంచి కంటెంట్ ఉన్నా కూడా డైరెక్షన్ సరిగ్గా లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. పాటల కోసమే సినిమా తీశాడని, తామెన్నో అంచనాలో మూవీకి వచ్చామని ఆ స్థాయిలో సినిమా లేదంటున్నారు. హరీష్ శంకర్ గనుక ఆర్టీసీ క్రాస్ రోడ్డు వస్తే రవితేజ ఫ్యాన్స్ కొడతారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..